Minister Ponguleti: నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కలిసి వారి స్వార్థం కోసం ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ధరణి వల్ల సామాన్య రైతులు ఎన్నో ఇబ్బందులు పడితేనే ఆ దొరలను ఫామ్ హౌస్ కి పంపారు.. జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వం ద్వారా లైసెన్స్ ఇచ్చి 6 వేల మంది సర్వేయర్లను తీసుకుంటాం.. దొరకి ఏం ఆలోచన వచ్చిందో కానీ అర్ధరాత్రి వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసేశారు అని పేర్కొన్నారు. మళ్ళీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Read Also: Manchu Lakshmi: ఎవ్వరికీ యుద్ధం ఇష్టముండదు.. కానీ కొన్ని సమయాల్లో తప్పదు!
ఇది పేదోడి ప్రభుత్వం.. మీరు కోరుకున్నట్టే కాంగ్రెస్ పాలన ఉంటుంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని గత బీఆర్ఎస్ నాయకులు సంపాదించిన భూముల వివరాలు బయటపడతాయని తెలిపారు. భూ భారతికి భయపడి దోపిడిదారులు పారిపోయారు.. అందుకే రియల్ ఎస్టేట్ కొద్దిగా డౌన్ అయ్యింది అన్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి పేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయిన తల తాకట్టు పెట్టి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, సబ్సిడీ సిలిండర్, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు పెడితే 1375 కోట్ల రూపాయలు పేదవాడి వైద్యం కోసం ఖర్చు పెడుతున్నాం అన్నారు. దేశంలోనే తెలంగాణని రోల్ మోడల్ గా నిలబెట్టడానికి కృషి చేస్తాం.. రెవెన్యూ వ్యవస్థలో చిన్న తప్పు కూడా జరగొద్దని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు.
