NTV Telugu Site icon

V. Srinivas Goud: రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది..

Srinivas

Srinivas

V. Srinivas Goud: తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన నివేదిక తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది అని ఆరోపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు.. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారు.. దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో తెలియదు.. బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు అన్నారు. మా అంచనా ప్రకారం తెలంగాణ జనాభా 4 కోట్లకు పైగా ఉంటుంది.. అందులో ఓటర్లు 3 కోట్ల 40 లక్షల మందికి పైగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చిల్లర వ్యవహారాలతో ఉద్యమాలు పుట్టుకు వస్తున్నాయని పేర్కొన్నారు. బీసీల జనాభా 60 శాతానికి పైగా ఉండాలన్నారు. మా దగ్గర సర్వే కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.. అలాగే, 2011 కంటే ఇప్పుడు ముస్లింల జనాభా తగ్గినట్లు చూపించారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Read Also: Kadiyam Srihari: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికే బండి సంజయ్, కిషన్రెడ్డి కేంద్ర మంత్రులు అయ్యారు..

ఇక, బీహార్ లో బీసీల జనాభా 10 శాతం పెరిగినట్లు చెప్పి కులాల వారీగా జాబితా ఇచ్చారు.. కానీ, కాంగ్రెస్ మాత్రం సంవత్సరం పాటు కాలయాపన చేసి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 4 వేల పేజీల నివేదికను ఎమ్మెల్యేలు ఎప్పుడు ప్రిపేర్ కావాలని ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకుంటారు.. బీజేపీతో మాట్లాడి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ ఎమ్మెల్యేలు ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తున్నాం.. తెలంగాణలో కులాల మధ్య కొట్లాటలు పెడుతున్నారు.. మాకు ట్యాబ్ లు ఇస్తే.. మేము సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.. తెలంగాణలో మరో బీసీ ఉద్యమం వస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.