Site icon NTV Telugu

Kishan Reddy: రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది.. దీనికి కారణం ఆ రెండు పార్టీలే

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పని చేసే పరిస్థితి లేదు అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులు 80 శాతం ఉన్నాయి.. ఎరువుల మీద 70 శాతం సబ్సిడీ కేంద్ర సర్కార్ ఇస్తుంది.. ఆర్థిక పరిస్థితితో రోడ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: TG Cabinet Expansion: రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..?

ఇక, తెలంగాణ రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి అప్పులు పుట్టని పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే అన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ కలలు కంటున్నాడు.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version