NTV Telugu Site icon

Hyderabad Rains: రాష్ట్రంలో ఉదయం నుంచి వాన.. చిరు జల్లులతో తడిసిన తెలంగాణ..

Hyderabad Rains

Hyderabad Rains

Hyderabad Rains: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి వాన కురుస్తుండటంతో తెలంగాణ తడిసిముద్దయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాల్లో 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ.ఎత్తు వరకు విస్తరించి ఉంటుందని.. పైకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంపుగా మారుతుందని తెలిపారు. సముద్ర మట్టానికి 1.5 కి.మీ. మీ ఎత్తులో అల్పపీడనం కొనసాగుతోందని ప్రకటించారు.

Read also: Dogs Attack: తెలంగాణలో హడలెత్తిస్తున్న వీధి కుక్కలు.. చిన్నారులపై ఆగని దాడులు..

దీంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీం, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Read also: Rohit Sharma: ఆ సమయంలో నా మైండ్ బ్లాంక్ అయింది: రోహిత్‌ శర్మ

మూడు రోజులు వానలే..

* రేపు (గురువారం) కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా కురుస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

* ఎల్లుండి (శుక్రవారం) ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

* శనివారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
Tolly wood : నేను ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తాను..