Hyderabad Rains: రాష్ట్రంలో ఉదయం నుంచి వాన.. చిరు జల్లులతో తడిసిన తెలంగాణ..
- గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ..
- వర్షాల కారణంగా నదులను తలపిస్తున్న కొన్ని ప్రాంతాలు..
- ఈరోజు ఉదయం నుంచి వాన కురుస్తుండటంతో తడిసిన తెలంగాణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Rains: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి వాన కురుస్తుండటంతో తెలంగాణ తడిసిముద్దయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాల్లో 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ.ఎత్తు వరకు విస్తరించి ఉంటుందని.. పైకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంపుగా మారుతుందని తెలిపారు. సముద్ర మట్టానికి 1.5 కి.మీ. మీ ఎత్తులో అల్పపీడనం కొనసాగుతోందని ప్రకటించారు.
Read also: Dogs Attack: తెలంగాణలో హడలెత్తిస్తున్న వీధి కుక్కలు.. చిన్నారులపై ఆగని దాడులు..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
దీంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీం, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Read also: Rohit Sharma: ఆ సమయంలో నా మైండ్ బ్లాంక్ అయింది: రోహిత్ శర్మ
మూడు రోజులు వానలే..
* రేపు (గురువారం) కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా కురుస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
* ఎల్లుండి (శుక్రవారం) ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
* శనివారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
Tolly wood : నేను ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తాను..
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!