DGP Jitender: తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు.. ఈ నెల 30లోపు వెళ్లిపోవాల్సిందే..!
- తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు ఉన్నారు..
- 199 మంది దీర్ఘకాల వీసాలపై ఉన్నారు..
- షార్ట్ టర్మ్ వీసాలున్న వారు వెంటనే తిరిగి వెళ్లిపోవాలి..
- ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుంచి పాకి వెళ్లిపోవచ్చు: డీజీపీ జితేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Jitender: NTVతో తెలంగాణ డీజీపి జితేందర్ మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీయులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. తెలంగాణలో 230 మంది పాకిస్తాన్ వాసులు ఉన్నారు.. వీరిలో 199 మంది లాంగ్ టర్న్ వీసాలు కలిగి ఉన్నారు.. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు అని తేల్చి చెప్పారు. ఇక, మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి.. ఈ షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: ACB: ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరాం ఇంటిపై కొనసాగుతున్న సోదాలు
Also Read
అయితే, లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంత మందికి నోటీసులు ఇచ్చామని డీజీపీ జితేందర్ తెలిపారు. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29వ తేదీ వరకు టైం ఉంది.. మిగిలిన వారు రేపు తిరిగి వెళ్ళిపోవాలి అని హెచ్చరించారు. ఈ నెల 30వ తేదీ వరకు అటల్ బోర్డర్ నుంచి పాకిస్తానీయులు వెళ్ళిపోవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. అలాగే, షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్ళిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి కో-ఆర్డినేషన్ లో జాయింట్ ఆపరేషన్ చేస్తామన్నారు. మరోవైపు, కర్రెగుట్టలో మావోయిస్టుల ఎరివేతలో తెలంగాణ పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఆపరేషన్ లేదన్నారు. మా బలగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కర్రెగుట్ట దగ్గర మోహరించలేదని డీజీపీ జితేందర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్‌ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!