CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు ఢిల్లీ, జైపూర్‌లలో పర్యటించనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి జైపూర్ చేరుకుంటారు. బంధువు వివాహానికి హాజరై మళ్లీ సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
Read also: Telangana GOVT: జీవో 46పై కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నారు. పలువురు మంత్రులను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌లు తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆయా శాఖల నుంచి గ్రాంట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రులను కోరే అవకాశం ఉంది. మూడు రోజుల పర్యటనలో ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read also:Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశం ఉన్నందున, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే ఈ కోర్ కమిటీ సమావేశం తప్పనిసరి అని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీకి విధేయులైన నేతలకు కార్యనిర్వాహక అధ్యక్ష, సీనియర్ ఉపాధ్యక్ష పదవులు దక్కుతాయని భావిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై ఈ నెలాఖరులోగా నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Belagavi: బెళగావిపై రెండు రాష్ట్రాలు మళ్లీ ఘర్షణ.. ఆదిత్య ఠాక్రే, సిద్ధరామయ్య మధ్య మాటల యుద్ధం!