Site icon NTV Telugu

Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Tg

Tg

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్​ భేటీ ఈరోజు (శనివారం) జరుగబోతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో కూడా రెవెన్యూ ఆఫీసర్ల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, మూసీ నిర్వాసితులకు ఓపెన్​ ప్లాట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఇందిరమ్మ కమిటీలు, కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి విధానాలపైన మంత్రివర్గంలో చర్చించి, క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, ఉద్యోగులకు పెండింగ్​ డీఏలపైనా కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్ తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: Papikondalu Tour: పాపికొండలు పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి ప్రారంభం..

ఇక, గతంలో వివిధ శాఖలకు పంపించిన వీఆర్వోలు, వీఆర్ఏలతో ఈ పోస్టుల భర్తీకి నేటి మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మూసీ నిర్వాసితులకు మెరుగైన ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చిన రేవంత్ సర్కార్, తాజాగా ఓఆర్ఆర్ వెంట ఓపెన్ ప్లాట్స్ ఇవ్వాలని చూస్తుంది. మొత్తం 600 నుంచి-700 ఎకరాలను మూసి నిర్వాసితులకు కేటాయించాలని కేబినెట్​ భేటీలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Read Also: YVS Chowdary : అక్టోబర్ 30న తొలిసారి కనిపించనున్న ఎన్టీఆర్

అలాగే, రైతు భరోసా విధివిధానాలపై రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే రైతు భరోసా గైడ్ లైన్స్ రూ​రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ నివేదికపైనా కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఈ సమావేశాల తేదీలపైనా చర్చించి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Exit mobile version