Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఇంకా ఏం మిగిలింది..?
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్ పూర్తి చేయండి..
- ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు..
- ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది?.. మీ పర్పస్ పూర్తయిందా లేదా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌పై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేసిన ధర్మాసనం.. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది? అంటూ దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ను పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. మీ పర్పస్ పూర్తయిందా? లేదా? మళ్లీ ఆయన్ని జైల్లో పెట్టాలనుకుంటున్నారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ప్రభాకర్‌రావును పిలవకుండా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరమైతే మళ్లీ పిలిచి విచారణ చేయవచ్చని, ప్రభాకర్‌రావు దర్యాప్తుకు సహకరిస్తారని కోర్టు వ్యాఖ్యానించింది.
Read Also: BJP National President: కమలం పార్టీలో నడ్డా శకం ముగిసింది.. బీజేపీకి నయా సారథి ఇతడే!
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ఇక, కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్ 142 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్‌రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా లేదా అనేదే ప్రధాన ప్రశ్నగా లూథ్రా పేర్కొన్నారు. అలాగే, కస్టడీలో ఉన్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దర్యాప్తు వేగం, కస్టడీ అవసరం, ముందస్తు బెయిల్ అంశాలపై కోర్టు స్పష్టత ఇవ్వడం ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు