NTV Telugu Site icon

Speaker Vs Harish Rao: మీరు చైర్ కి నేర్పించాల్సిన అవసరం లేదు.. హరీష్‌ రావు పై స్పీకర్‌ ఫైర్‌..

Speaker Vs Harish Rao

Speaker Vs Harish Rao

Speaker Vs Harish Rao: వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు స్పీకర్‌ వర్సెస్‌ హరీష్‌ రావు మాటలు హాట్‌ టాపిక్‌ గా నిలిచాయి. స్పీకర్‌కు సభ సాంప్రదాయాలను హరీష్‌ రావు చెప్పడం దానికి స్పీకర్‌ సమాధానం చెప్పడంతో అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు కొనసాగాయి. ముందుగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. స్పీకర్‌ సార్‌ శాసన సభ పక్షనేతగా ఎవరు మాట్లాడుతారన్నది ఈ సభలో వున్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు. మా పార్టీ తరుపున ఎవరు మాట్లాడుతారు అని అడుగుతారు. మేము ఎవరికి అడిగితే వారికిచ్చే సాంప్రదాయం ఉందంటూ తెలిపారు. కానీ స్పీకర్‌ సభ సాంప్రదాయలకు అంటూ హరీష్‌ రావు మాట్లాడుతున్న తరుణంలో వెంటనే స్పందించిన స్పీకర్‌ హరీష్‌ రావుపై ఫైర్‌ అయ్యారు. ఈ సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉందంటూ హరీష్‌ రావు కు తెలిపారు. మీరు చైర్ కి నేర్పించాల్సిన అవసరంలేదంటూ ఫైర్‌ అయ్యారు. నేను సీనియర్ నీ.. మీరేం చెప్పొద్దూ అని అసెంబ్లీలో హరీష్‌ రావుకు స్పీకర్‌ తెలిపారు. మీకు అవకాశం ఇచ్చినం మీరు మాట్లాడండి అంటూ హరీష్‌ కు స్పీకర్‌ అన్నారు.

Read also: CM Chandrababu at Srisailam Temple: శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు..

ఇక హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే హక్కున్న ఏదైనా ఒక అంశం మీద ప్రధాన పతిపక్షం నుంచి ఎవరు మాట్లాడుతారని అడిగి వారి నుంచి పేరును తీసుకుని మాట్లాడించే సాంప్రదాయం ఈ సభలో ఉందని స్పీకర్‌ కు తెలిపారు. ఈ సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కినందుకు నిరసన తెలిపారు. ఈ సభ కౌరవ సభలా నడుస్తుంది. ఫైనల్ గా పాండవులు గెలిచారన్నారు. వర్గీకరణ వెంటనే చేయాలని కేసీఆర్ తీర్మానం చేశారని తెలిపారు. వర్గీకరణ వెంటనే చేయాలని.. ప్రధాని కి లేఖ కూడా ఇచ్చి వచ్చారన్నారు. వర్గీకరణ కోసం మాదిగలు గాంధీ భవన్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ పట్టించుకున్నారన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదని హరీష్‌ రావు తెలిపారు. ఇవాళ అధికారం ఉందని, మందబలంతో అహకారంతో చేస్తున్న పనులు, మాటలు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని తెలిపారు. తప్పకుండా మీకు తగిన గుణపాఠం నేర్పే రోజు ఉంటదని కాంగ్రెస్ పార్టీ నేతలకు జాగ్రత్త అంటూ హరీష్‌ రావు అన్నారు.

Read also: CM Revanth Reddy: ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తాం..

ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్ణ్వోన్నత న్యాయం స్థానం తీర్పును బీఆర్ఎస పార్టీ పక్షాణ హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నామన్నారు. ఈ యొక్క వర్గీకరణ మీద బీఆర్ఎస ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 29, 2014 లో ఎస్సీ వర్గీకణ వెంటనే చేయాలని ఆనాడు సభానాయకుడు కేసీఆర్‌ సభలో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకర చేపట్టారని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక న్యాయ కోణంలో ఆలోచించేది కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఎంత న్యాయమైనదో తెలంగాణ డిమాండు కూడా న్యాయమైనదని కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. అందుకే రాష్ట్రంలో బీఆర్ ఎస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. కేసీఆర్ స్వయంగా సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి ఎస్సీ వర్గీకరణ చేయాలని లేఖ ఇచ్చారన్నారు. ఎస్సీ వర్గీకరణ నా బాధ్యత అని కేసీఆర్ చెప్పారని హరీశ్ రావు ప్రస్తావించారు. అంతే కాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని కూడా కేసీఆర్ గతంలో అభ్యర్థించారు. ఇప్పుడు గౌరవనీయులైన సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఆయన అన్నారు.
Godavari Flood: తగ్గుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు ప్రవాహం..