Site icon NTV Telugu

Hyderabad: మాదాపూర్‌, గచ్చిబౌలిలోని పబ్‌లలో పోలీసుల సోదాలు.. నలుగురు అరెస్ట్

Pubs

Pubs

Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌లోని పలు పబ్‌లలో ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్‌లోని యువత మత్తులో జోగుతున్నారు. ఇక, పబ్ లో పలువురికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో నలుగురు యువకులు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.

Exit mobile version