NTV Telugu Site icon

SI Passing Out Parade: పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం రేవంత్..

Si Paredu

Si Paredu

SI Passing Out Parade: తెలంగాణ హోంశాఖలో త్వరలో కొత్తగా మరో 547 మంది ఎస్ఐలు చేరబోతున్నారు. సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్‌ పోలీస్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాల్లో వీరికి ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వనుంది. వీరందరూ తాజాగా రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 9 నెలల పాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర హోంశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో వీరికి విధులు అప్పగించేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ( బుధవారం) పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (పీవోపీ) నిర్వహించబోతున్నట్లు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిష్త్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Read Also: Rahul Gandhi : అమెరికాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్

కాగా, తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్.. పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. కాగా, మొత్తం 547 మంది ఎస్సైలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547లో 401 మంది సివిల్ ఎస్ఐలు ఉండగా.. 547లో 472 మంది గ్రాడ్యూయేట్స్ 75 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్ ఉన్నారు. వీరిలో 248 మంది ఎస్ఐలకు బీటెక్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. పరేడ్ కమాండర్ గా మహిళా ఎస్ఐ పల్లి భాగ్యశ్రీ ఉండనున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో అత్యధికంగా 26 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసు గల అభ్యర్థులు ఉన్నారు. 283 మంది 26 నుంచి 30 సంవత్సరాల వయసు కలవారు.. 182 మంది 25 ఏళ్ళ లోపు వయసున్న వారు ఉన్నారు. ఈ పరేడ్ తర్వాత పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)పై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Show comments