Bomb Threats: హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్) మరోసారి బాంబ్ బెదిరింపుల ఈ- మెయిల్ వచ్చింది. ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పై పోలీసులు సీరియస్ అవుతున్నారు. ఈ ఏడాది ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్టుకే 28 బాంబ్ బెదిరింపులు మెయిల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని చెకింగ్స్ చేశాక ఫేక్ మెయిల్స్ గా భద్రతా సిబ్బంది నిర్ధారించింది. ఇప్పటికే బాంబ్ బెదిరింపులపై RGIA పోలీస్ స్టేషన్ లో 28 కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Mamitha Baiju: ఆ క్రికెటర్ చేతిలో మమితా బైజు పెళ్లి బాధ్యతలు.. లవ్ మెసేజ్‌లన్నీ ఆయనకే వెళ్తాయట!
ఇక, ఈ కేసులపై RGIA పోలీసులు లోతుగా దర్యాప్తు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీటిని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయాలని యోచిస్తున్నారు. డార్క్ వెబ్ ఉపయోగించి ఫేక్ మెయిల్స్ ను కేటుగాళ్లు పంపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫేక్ బాంబు బెదిరింపుల కేసులు బదిలీ చేయనున్నట్లు తెలుస్తుంది.