NTV Telugu Site icon

Rythu Runa Mafi: రైతులకు గుడ్‌ న్యూస్‌.. రెండో విడుత రుణమాఫీ నిధులు విడుదల..

Rytu Runa Mafi

Rytu Runa Mafi

Rythu Runa Mafi: రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పుడు రెండో విడత రైతు రుణమాఫీకు సిద్ధమైంది. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు విడుదల చేస్తామన్న ప్రకారమే రేపు నిధులు విడుదల చేస్తుంది సర్కార్. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే విషయమై ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి నిధులు పడుతాయని వెల్లడించింది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. రేపు సభలో రుణమాఫీ పై తెలంగాణ సర్కార్ చర్చ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. సభలో 19 శాఖల పద్ధులపై చర్చ నేపథ్యంలో ప్రకటన ఐనా చేయాలని సర్కార్ భావిస్తుంది.

Read also: Ajith Kumar: మరోసారి అజిత్ vs అర్జున్..మ్యాటర్ ఏంటంటే..?

కాగా.. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు మాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతుండటంతో దీనిపై మంత్రి తుమ్మల స్పందించిన విషయం తెలిసిందే. రెండో విడత రుణమాఫీలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ.1.50 లక్షల వరకు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని దీనిపై మంత్రి తుమ్మల వివరణ ఇచ్చారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు మాఫీ అవుతుందని భావించగా కొంత మంది రైతుల ఖాతాల్లో సాంకేతిక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. రుణమాఫీ సొమ్మును రిజర్వ్‌ బ్యాంకు ఈ-కుబేర్‌ విధానంలో జమ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 17 వేల 877 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 84.94 కోట్ల రూపాయలు జమ కాలేదన్నారు. ఆ నిధులు ఆర్‌బీఐ వద్దే ఉన్నాయని తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌