Rythu Runa Mafi: రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడుత రుణమాఫీ నిధులు విడుదల..
- రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల..
- లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి నిధులు..
- అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Runa Mafi: రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పుడు రెండో విడత రైతు రుణమాఫీకు సిద్ధమైంది. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు విడుదల చేస్తామన్న ప్రకారమే రేపు నిధులు విడుదల చేస్తుంది సర్కార్. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే విషయమై ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి నిధులు పడుతాయని వెల్లడించింది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. రేపు సభలో రుణమాఫీ పై తెలంగాణ సర్కార్ చర్చ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. సభలో 19 శాఖల పద్ధులపై చర్చ నేపథ్యంలో ప్రకటన ఐనా చేయాలని సర్కార్ భావిస్తుంది.
Read also: Ajith Kumar: మరోసారి అజిత్ vs అర్జున్..మ్యాటర్ ఏంటంటే..?
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
కాగా.. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు మాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతుండటంతో దీనిపై మంత్రి తుమ్మల స్పందించిన విషయం తెలిసిందే. రెండో విడత రుణమాఫీలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ.1.50 లక్షల వరకు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని దీనిపై మంత్రి తుమ్మల వివరణ ఇచ్చారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు మాఫీ అవుతుందని భావించగా కొంత మంది రైతుల ఖాతాల్లో సాంకేతిక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. రుణమాఫీ సొమ్మును రిజర్వ్ బ్యాంకు ఈ-కుబేర్ విధానంలో జమ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 17 వేల 877 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 84.94 కోట్ల రూపాయలు జమ కాలేదన్నారు. ఆ నిధులు ఆర్బీఐ వద్దే ఉన్నాయని తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!