RTC MD Sajjanar: పిల్లాడి ప్రాణంతో రిస్క్ అవసరమా..? సజ్జనార్ ఫైర్..
- పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం..
- ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC MD Sajjanar: సోషల్ మీడియా ఇప్పుడు ప్రజల జీవితంలో భాగమైపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలను పంచుకోవడం ద్వారా పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు.
Read also: Hydraa Update: కూకట్ పల్లి, అమీన్ పూర్.. హైడ్రా అప్డేట్ ..
Also Read
తాజాగా ఓ మహిళ బావి గోడపై కూర్చోని చిన్న పిల్లాడితో ప్రమాదకరమైన వీడియో చిత్రీకరించింది. బావి గోడ అంచున కూర్చున్న ఓ మహిళ సుమారు రెండు మూడేళ్ల వయస్సు కలిగిన పిల్లవాడిని బావి లోపలివైపుకు ఉంచి బాలుడు చేతిని పట్టుకొని ఉంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడు బావిలో పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితే ఉందని, ఎక్కడ తాను పడిపోతానో అంటూ భయపడుతూ గట్టిగా ఆ మహిళ కాలును పట్టుని కూర్చోవడంపై సోషల్ మీడియాలో అందరూ మండిపడుతున్నారు. బాలుడి ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడంపై నెటిజన్లు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు బానిసలు కాకండి.. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి అంటూ సజ్జనార్ తెలిపారు.
ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు.
సోషల్ మీడియాకు బానిసలు కాకండి. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి. pic.twitter.com/rp4Qrk2kmn
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 22, 2024
Bandi Sanjay: డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది.. బండి సంజయ్ హాట్ కామెంట్స్..
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?