NTV Telugu Site icon

RTA Raids: ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై కొనసాగుతున్న రవాణా శాఖ దాడులు

Rta

Rta

RTA Raids: రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడో రోజు రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్- ఆరంఘర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల కొరడా ఝలిపిస్తున్నారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచేలా చేస్తున్న 8 ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇక, రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం ఆదేశాల మేరకు ఉదయం నాలుగు గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి.

Read Also: Venky : ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రన్‌టైమ్ లాక్

మరోవైపు, పెద్ద అంబర్ పేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులను సీజ్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో రవాణా శాఖ అధికారుల సోదాలతో పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే, ఔటర్ రింగు రోడ్డుపై సైతం వందల వాహనాలు బారులు తీరాయి. టోలు ఫీజలు వసూలు చేస్తుండడంతో భారీగా నిలిచిపోయిన వాహనాలు.. దీని వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Show comments