NTV Telugu Site icon

Harish Vs Ponnam: దయచేసి కేసీఆర్‌ ప్రస్తావన వద్దు.. సభలో హరీష్‌కు పొన్నం వినతి

Harish Rao Vs Ponnam Prabhakar

Harish Rao Vs Ponnam Prabhakar

Harish Vs Ponnam: దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అనూహ్యంగా ఎదిగారన్నారు. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం చేశాం. కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది. హైదరాబాద్‌లో కేసీఆర్‌ పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయనను మా పీవీగా, టీవీగా గౌరవించాం. కాంగ్రెస్‌ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించినా మన్మోహన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మన్మోహన్‌ తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్‌ చించేసినా ప్రధానిగా ఆయన మాట్లాడలేదని తెలిపారు.

Read also: Tollywood : మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం.. దర్శకుడు ఎవరంటే.?

దాదాపు రెండేళ్ల పాటు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ పనిచేశారని గుర్తు చేశారు. 2004లో కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగిలినా అధైర్య పడొద్దని ప్రోత్సహించారన్నారు. కేంద్ర కేబినెట్‌ లో చేరాలని కేసీఆర్‌ ను మన్మోహన్‌ సింగ్‌ ఆహ్వానించారన్నారు. కేంద్ర కేబినెట్‌ లో చేరాలని కేసీఆర్‌ ను మన్మోహన్‌ సింగ్‌ ఆహ్వానించారన్నారు. నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీకి రాలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీకి వచ్చామని కేసీఆర్‌ అన్నారని తెలిపారు. యూపీఐ సమావేశంలో మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ కూడా మాట్లాడుతూ మేము తెలంగాణ తప్పకుండా ఏర్పాటు చేస్తామని, మీరు కేంద్రంలో చేరాలని కేసీఆర్‌ ను కోరారని హరీష్‌ రావు తెలిపారు. ఆయన ఆహ్వాన్నాన్ని స్వీకరించి కేసీఆర్ చేరారని గుర్తుచేశారు.

Read also: Priyanka Gandhi: డబుల్ ఇంజిన్‌ సర్కార్లో యువతపై డబుల్ దాడులు..

హరీష్ రావ్ .. పొన్నం ప్రభాకర్

కాగా.. అసెంబ్లీలో హరీష్‌ రావు మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ అంటే గౌరవం కాదనడం లేదు.. కేసీఆర్ గురించి ఎందుకు అధ్యక్ష అన్నారు. దేశిని చినమల్లయ్య కి… ప్రో. జయశంకర్ కి ఏం గౌరవం దక్కింది అనేది చర్చ జరగాలా..? మన్మోహన్ సింగ్ సంతాప సభలో ఇవన్నీ ఎందుకీ అధ్యక్ష అన్నారు. సంతాప సభలో ఇవన్నీ చెప్పడానికి సందర్భం కాదన్నారు. దయచేసి మన్మోహన్‌ సింగ్ సంతాప సభ గురించి చర్చిస్తే మేలనే అసెంబ్లీలో రెండు చేతులు జోడించి తెలిపారు. మనం వాగ్దానాలు లేదంటే జరిగినటు వంటి మాటలు కాదు.. ఇవాళ మన్మోహన్‌ సింగ్‌ సంతాప సభ దాని గురించి మాట్లాడితే బాగుంటుందని సభలో తెలిపారు.

Read also: Priyanka Gandhi: డబుల్ ఇంజిన్‌ సర్కార్లో యువతపై డబుల్ దాడులు..

అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. శాసన మండలిలో కూడా మన్మోహన్ కు నివాళులర్పించి ఉంటే బాగుండేదన్నారు. హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలని హరీష్ రావు కోరారు. దేశ చరిత్రలో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారని హరీష్ రావు అన్నారు. మన్మోహన్ పదవుల కోసం వెతకలేదు. మన్మోహన్‌ను వెతుక్కుంటూ పదవులు వచ్చాయి. పీవీ, మన్మోహన్ ఇద్దరూ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. కాంగ్రెస్ ఓటమికి పీవీ సంస్కరణలే కారణమని ఆంటోనీ నివేదిక పేర్కొంది.

Read also: The Family Man 3 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ షూటింగ్‌ పూర్తి.. క్లారిటీ ఇచ్చిన మనోజ్

ఓటమికి మన్మోహన్ బాధ్యుడిని చేసినా ఆయన వెనక్కి తగ్గలేదు. లాలూను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇబ్బందులు ఎదురైనా మన్మోహన్ మౌనం వహించారు. మన్మోహన్ హయాంలోనే తెలంగాణ ఆవిర్భవించిందని హరీష్ రావు అన్నారు. జన్మభూమి కోసం ఎన్నో అవకాశాలను వదులుకున్నామన్నారు. దేశ రాజకీయాల్లోకి పీవీ మన్మోహన్‌ను తీసుకొచ్చారన్నారు. పీవీకి మన్మోహన్ నమ్మక ద్రోహం చేయలేదన్నారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన ప్రసంగం బెస్ట్ అని కొనియాడారు. లైసెన్స్‌ రాజ్‌, పర్మిట్‌ రాజ్‌కు మన్మోహన్‌ స్వస్తి పలికారని గుర్తు చేశారు.
Ethiopia: ఇథియోపియాలో ఘోర ప్రమాదం.. 71మంది మృతి

Show comments