Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వంలో కండిషన్‌లు పెట్టి ఇళ్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రభుత్వం కాదన్నారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇళ్లు ఇస్తే కూలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 4.50 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అభ్యర్ధించారని తెలిపారు. ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్‌లో నమోదు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Read also: Triple Talaq: భార్య ఒంటరిగా వాకింగ్‌కు వెళ్తుందని ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..
సంక్రాంతి నాటికి కూసుమంచిలో మోడల్ హౌజ్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు మంత్రి. ఎవరు ఇళ్లు వారే నిర్మించుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రజాపాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. పేదవారికి భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. గ్రామాలకు సర్వేకు వచ్చే అధికారులు ఇందిరమ్మ కమిటీలను కలుపుకుని పోవాలన్నారు. పేదవారి కలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు.
Software Employee: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్ చేసి మరీ..