Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ లింకులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి… ఉప ఎన్నికల సమయంలో పోలీసులతో డబ్బులు పంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బు తరలింపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు… ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు… వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
Read also: Rajanna Sircilla Crime: సిరిసిల్లలో దారుణం.. దంపతుల అనుమానస్పద మృతి..
అయితే తిరుపతన్న ఫోన్ డేటాను వెలికితీయడంతో కీలక ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ సీడీఆర్ ఆధారంగా బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతకుముందు… ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టుకు హాజరుకావాలని చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఈనెల 11న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఆదేశించగా.. అనారోగ్యం కారణంగా ఆ సమయంలో విచారణకు హాజరుకాలేకపోయానని పోలీసులకు తెలిపాడు. ఈరోజు (నవంబర్ 14) విచారణకు హాజరు కావాలని చిరుమర్తి లింగయ్య అభ్యర్థించారు. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే గురువారం విచారణకు హాజరుకానున్నారు.
CM Revanth Reddy: నేడు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు.. హాజరు కానున్న సీఎం