Telangana Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. పబ్, బార్‌ల, ఈవెంట్ నిర్వహిస్తున్న నిర్వహకులపై నిఘా పెట్టారు. హైదరాబాద్ లోని పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, రిసార్ట్‌లపై నిఘా పెంచారు. న్యూయర్ వేడుకలపై రంగంలోకి దిగిన నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు.. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో కలిసి తనఖీ చేశారు. వేడుకల్లో ఎటువంటి డ్రగ్స్ కు వినియోగించకుండ చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశించారు. డ్రగ్ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తామని వారి నుంచి అండర్‌టేకింగ్ తీసుకున్నారు.
Read also: ATM Fraud: కామారెడ్డిలో కేటుగాడు.. ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు కాజేసిన దుండగుడు..
తనిఖీలు చేసిన రెస్టారెంట్‌లు ఇవే..
* బంజారాహిల్స్ పరిధిలోని టాస్, హోయిస్ట్, పార్క్ హయత్, లీలా హైదరాబాద్ స్టార్ హోటల్ అండ్ బార్‌లలో తనిఖీలు చేశారు.
* ఉప్పల్ పరిధిలోని వేవ్ పబ్, రాజేంద్ర నగర్‌లోని సిలెబర్ టెర్రేస్ కిచెన్‌లో తనిఖీలు చేపట్టారు.
* ఫిల్మ్ నగర్ లోని మూన్ షైన్ పబ్, జూబ్లీహిల్స్ లోని పలు పబ్బులు, బార్లలో తనిఖీలు చేశారు.
* సరూర్ నగర్ పరిధిలోని అర్బన్ బీట్స్, నైన్ ఓ నైన్, 1634ఈస్ట్ బార్, మోకిల పరిధిలోని రిసార్టులు, బార్లలో తనిఖీలు
* గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి పరిధుల్లోని పబ్బులు బార్లలో పోలీసులు తనిఖీ చేసిన వారి నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నారు.
Read also: Jagtial Govt Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుషం.. వృద్ధ దంపతుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం..
పబ్బులలో డ్రగ్స్ దొరుకితే సీజ్ చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సమయం ఇచ్చిన ప్రకారమే పబ్‌లు నిర్వహించాలని తెలిపారు. మందు సప్లై కూడా సమయం పాటించాలని సమయానికి మించి మందులు సప్లై చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. న్యూయర్ వేడుకల్లో అపశృతి చోటుచేసుకోకుండా పబ్ నిర్వాహకులు జాగ్రత్తగా నిర్వహించాలని తెలిపారు. ఏమాత్రం అలసట నిర్వహించినా చర్యలు తప్పవని పేర్కొన్నారు.
Chhattisgarh: సమతా పేరిట సంచలన లేఖ విదుదల చేసిన మావోయిస్టులు