Miss World 2025: మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న థాయ్‌లాండ్ భామ సుచతా
- మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న థాయ్‌లాండ్ భామ
- ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీకి కిరీటాన్ని అలంకరించిన సీఎం రేవంత్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ సుందరి కిరీటాన్ని థాయ్‌లాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీ సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ 72వ విజేతగా ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీ నిలిచింది. ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీకి మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు. ఇక రన్నరప్‌గా ఇథియోపియా భామ నిలిచింది. మూడో స్థానంలో పోలెండ్, నాల్గో స్థానంలో మార్టినిక్ భామ నిలిచింది.

Also Read
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ప్రపంచ సుందరి 2025 కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు మొత్తం 108 దేశాల అందాల భామలు పోటీలో పాల్గొన్నారు. ఇందులో 16 మంది క్వార్టర్స్‌కు ఎంపికయ్యారు. చివరి రౌండ్‌లో అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఫైనల్‌కు వచ్చిన నలుగురిలో తుది ప్రశ్న ద్వారా న్యాయనిర్ణేతలు మిస్ వరల్డ్ విజేతను ప్రకటించారు. మొత్తానికి థాయ్‌లాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీ కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, మెయిన్ స్పాన్సర్ల ద్వారా ఈ ప్రైజ్ మనీ అందించారు.
ప్రపంచ సుందరి-2025 ఫైనల్ పోటీలు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, టాలీవుడ్, బాలీవుడ్, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం 3,500 మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక న్యాయ నిర్ణేతలుగా నటుడు సోనూ సూద్, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లార్ ఉన్నారు.
భారత్‌కు 6 సార్లు కిరీటం..
ఇక ఇప్పటి వరకు అత్యధిక సార్లు మిస్ వరల్డ్ కిరీటం ఇండియా, వెనిజులా దక్కించుకున్నాయి. భారత్‌కు ఆరు సార్లు మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లార్ సొంతం చేసుకున్నారు. అలాగే వెనిజులా కూడా ఆరు సార్లు కిరీటం దక్కించుకుంది. యూకే 5 సార్లు, యూఎస్ఏ, సౌతాఫ్రికా చెరో 3 సార్లు కిరీటం సొంతం చేసుకున్నాయి.
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్‌ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!