BJP MP Laxman: బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఎన్టీవీ మాట్లాడుతూ.. మూసీ నివాసితులు దయనీయమైన గుబులులో ఉన్నారని తెలిపారు. ఎంతో ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నమని తెలియజేస్తున్నారు.. లీ నాళి చేసుకుంటూ 40 ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తున్నారు.. వారి ఆవేదన వినడమే కాకుండా.. వారికి భారతీయ జనతా పార్టీ తరపున భరోసా కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర చేపట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. నిజంగా మూసి ప్రక్షాళన చేయాలంటే.. అందుకు అనేకమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.. డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చి.. దానికి కావాల్సిన నిధులు కేటాయించండి.. ఆ రకంగా చేయకుండా మూసీ పరివాహక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.. ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాలేదు.. ప్రజల మీద ఎందుకీ ప్రతాపం?.. పేదలు చేసిన పాపం ఏంటి..? అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.
Read Also: Pregnancy Job Scam: నిరుద్యోగులే టార్గెట్.. గర్భవతిని చేస్తే లక్షల్లో సంపాదన అంటూ మోసం
అలాగే, 150 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లకు మార్కింగ్ చేయడం ఏంటి? అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ క్వశ్చన్ చేశారు. ప్రభుత్వానికి చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్లు వ్యవహరిస్తున్నారు.. దున్నపోతు నిద్రలో ఉన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.. కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది.. మూసి ప్రక్షాళన పేరు మీద 150 కోట్లతో అవసరమా అని ప్రశ్నిస్తున్నా.. మూసి నిద్ర పేరు మీద ఒక్క రోజు కార్యక్రమం కాదు.. ఇది బీజేపీ తరపున ఒక హెచ్చరిక మాత్రమే అని ఆయన తెలిపారు. భవిష్యత్త్ లో ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి బీజేపీ నాయకులంతా కదం తొక్కారు.. ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలి.. పేదల జీవితాలతో చెలగాటం ఆడితే.. బుల్డోజర్లకు అడ్డం నిలబడైనా వారికి న్యాయం చేయడానికి మేము ఉన్నాం.. అర్ధాంతరంగా ఇండ్లు తొలగిస్తామని ఇక పక్ష నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తే.. మీ ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని లక్ష్మణ్ వెల్లడించారు.