Eatala Rajendar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా కేబినెట్ లో ఆమోదం లేకుండా ఏమి జరగదు.. ఆయన మంత్రి వర్గంలో ఉన్నవారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారిని అడగవచ్చు అని సూచించారు. కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ అని నేను చెప్పాను, అది ఎప్పుడు మొదలయ్యిందో తెలుసుకోవాలి అని పేర్కొన్నారు. సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రొజెక్టులు రీ డిజైన్ లో కేసీఆర్ చేర్చారు.. అవినీతి జరిగితే విచారణ జరపండి, విచారణ జరిగిన చర్యలు తీసుకుంటారాని నమ్మకం లేదు, అందుకే సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు రాజకీయ పార్టీలకు ఏటిఎంలుగా మారాయని ఎంపీ ఈటల తెలిపారు.
Read Also: PM Modi: రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..
అయితే, మొదట పిల్లర్లు రిపేర్ చేసి నీళ్లు ఇచ్చే పని పెట్టుకోండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు, వాటి పేరుతో అక్రమాలు చేయడం తప్పు అన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందా అని ప్రశ్నించారు. ప్రతి నిర్ణయం కేబినెట్ రాటిఫికేషన్ జరుగుతుంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాను అని చెప్పుకొచ్చారు. మీ డిపార్ట్మెంటో ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా.. కేబినెట్ లో పెట్టండి అని కేసీఆర్ చెప్పే వారు ఇది నిజం కాదంటే నేను దేనికైనా సిద్ధం అని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మించడం, అవినీతి వేరువేరుగా చూడాలి.. ప్రాజెక్ట్ నిర్మించాలి కానీ వాటిని అడ్డం పెట్టుకొని సంపాదించడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుందని బీజేపీ ఎంపీ ఈటల చెప్పారు.
Read Also: Malavika: ప్రభాస్ బాగా మాట్లాడతారు!
ఇక, తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగింది అని ఈటల రాజేందర్ తెలిపారు. నేను జైళ్లకు పోయిన, నా రక్తం చిందిది, పెట్రోల్ మంటల్లో యువత కాలిపోయింది, ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టాలా వద్దా? అని ప్రశ్నించారు. అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే మొదలు పెట్టారు కానీ పూర్తిచేయలేదు.. జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత- చేవెళ్ల ఐదేళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టేనా కదా?.. ఎందుకు పూర్తి చేయలేదన్నారు. కమీషన్ త్వరగా పూర్తి చేయాలి అవినీతి నిగ్గు తేల్చాలి.. బీజేపీ అయితే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది.. బీజేపీ ప్రాజెక్ట్స్ కట్టడానికి వ్యతిరేకం కాదు.. అధికారం అడ్డం పెట్టుకొని టెండర్లు లేకుండా పనులు పంచుకోవడం తప్పు అని ఎంపీ ఈటల పేర్కొన్నారు.
