Site icon NTV Telugu

MP DK Aruna: ఖబడ్దార్ పాకిస్తాన్.. భారత్ వైపు చూస్తే అంతం చేస్తాం..

Aruna

Aruna

MP DK Aruna: పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారంగా ఆపరేషన్‌ సింధూర్‌ విజయాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశం మిగలదని మన సైనికులు సంకేతం ఇచ్చారు.. ఉగ్రవాదులను, దుండగులను ఐక్యతతో అంతం చేస్తామని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించే పాకిస్తాన్ కు ఖబర్దార్ బిడ్డ అంటూ సంకేతాలు ఇచ్చిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీది, భారత సైన్యానిధి అన్నారు.

Read Also: Vijay Sethupathi: తెలుగులోకి విజయ్ సేతుపతి ‘ఏస్’

అయితే, భారత సైనిక బలగాల త్యాగాలు మరువలేనిది అని ఎంపీ డీకే అరుణ తెలిపారు. దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే అందుకు బలగాల త్యాగాలేనని గుర్తు పెట్టుకోవాలి అన్నారు. మహిళల ముందు సిగ్గు లేకుండా తీవ్రవాదులు పాశవికంగా ప్రవర్తించారు.. ఉగ్రవాదుల అంతూ చూసే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదు.. దేశ ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు నడవాలి.. పహల్గంలో ప్రాణాలు కోల్పోయిన అందిరికీ నివాళులు అని డీకే అరుణ చెప్పుకొచ్చారు.

Read Also: Eatala Rajendar: ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది..

ఇక, బయట వాళ్ళను గుర్తించి తరిమికొడుతున్నామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కానీ, హైదరాబాద్ లో స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి.. వాళ్లను గుర్తించాలని తెలిపారు. ఇక్కడ కొంతమంది సన్నాసులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్యాబినెట్ లో ఉంటారు కాబట్టి.. అనుమతి తీసుకోవాలి.. ఒక నెల రోజులు సైన్యంలోకి ఈ సన్నాసులను తీసుకెళ్లాలి అని సూచించారు. హైదరాబాద్ లో ఉన్న రోహ్యింగాలను, స్లీపింగ్ సెల్స్, దేశ ద్రోహులను యూనిఫాం లేని మనం గుర్తించాలని పేర్కొన్నారు. దేశంలో మనం అంతా ప్రతి విదేశీయులపై ఒక కన్ను వేసి పెట్టాలి అని రాఘునందన్ రావు పిలుపునిచ్చారు.

Exit mobile version