NTV Telugu Site icon

Kavitha First Tweet: 165 రోజుల విరామం తర్వాత కవిత ట్విట్టర్ పోస్ట్ వైరల్‌..

Mlc Kavith Afirst Tweet

Mlc Kavith Afirst Tweet

Kavitha First Tweet: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి బెయిల్‌పై విడుదలైన కవిత బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఐదున్నర నెలల తర్వాత తెలంగాణ గడ్డపై అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా కవితకు సొంతగడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. ఈ నేప‌థ్యంలో సుదీర్ఘ విరామం త‌ర్వాత ఆమె త‌న తొలి ట్వీట్‌ను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది. సత్యం గెలిచిందని పేర్కొన్నారు. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేశారు.

Read also: Second Marriage: భార్య మంచి మనసు.. దగ్గరుండి భర్తకు మరో యువతితో పెళ్లి..

ఈ ట్వీట్ కోసం తన నివాసానికి చేరుకున్న తర్వాత, ఆమె తన భర్త అనిల్ మరియు సోదరుడు కేటీఆర్‌తో అభిమానులను పలకరిస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. కవిత చివరిసారిగా మార్చి 14న ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ట్వీట్ చేశారు. యాదాద్రి గుడి ఫొటో పేపర్‌ క్లిప్‌ని షేర్‌ చేస్తూ.. ‘దేవుడు శాసించాడు.. కేసీఆర్‌ నిర్మించాడు!!’ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత కవిత అరెస్టయి అప్పటి నుంచి జైలులో ఉన్నారు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన కవిత.. 160 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ట్విట్టర్ (ఎక్స్‌) లో తొలి ట్వీట్‌ చేసింది. దీంతో కవిత చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
అక్కడ స్త్రీలు దుస్తులు ధరించరు.. వీధుల్లోకి అలాగే..

Show comments