NTV Telugu Site icon

Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చేసిన పొరపాటుతో తెలంగాణ రైతులకు కష్టకాలం వచ్చింది..

Uttam

Uttam

Uttam Kumar Reddy: గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకి తెలిసి మాట్లాడుతున్నాడో.. తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. రబీ యాక్షన్ ప్లాన్ ప్రకారం నీటి విడుదల చేస్తున్నాం.. హరీష్ మా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు.. ముఖ్యమంత్రి, నేను ఇద్దరం కలక్టర్, చీఫ్ ఇంజనీర్ లకు ఆదేశాలు జారీ చేశాం.. పంట దెబ్బతినకుండా నీళ్లు ఇవ్వాలని పేర్కొన్నాం.. ఇక, బీఆర్ఎస్ చేసిన పొరపాటుతో తెలంగాణ రైతులకు కష్టకాలం వచ్చింది అని ఆరోపించారు. గతంలో కేసీఆర్, జగన్ విందు, వినోదాలు చేసుకున్నారు అని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

Read Also: YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి మృతి..

ఇక, కృష్ణా నదిలో అక్రమంగా తెలంగాణకు సంబంధించిన నీటిని ఏపీ తరలించుకుపోతుంటే.. ఆనాటి ఆంధ్ర పాలకులతో కేసీఆర్ కుమ్మక్కైయ్యాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ఎక్కువ నీళ్లు ఇవ్వండి అని లేఖ రాసి.. ఇప్పుడు మమ్మల్ని తిడుతున్నారు.. మీరా మాకు చెప్పేది అని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో వాటా సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర కొట్లాడుతున్నాం.. గోదావరి నీళ్లు దోపిడి మీదే.. కమిషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట కట్టకుండా వదిలేశారు అన్నారు. నాణ్యత లేని ప్రాజెక్టు కట్టి.. ఇప్పుడు విడ్డూరంగా మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. మేడి గడ్డ నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పింది.. నీళ్లు నింపితే కొట్టుకుపోతుందన్నారు. అలాగే, 40 గ్రామాలతో పాటు భద్రాచలం మునిగిపోతుందని హెచ్చరించారు అని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

Read Also: Jio Recharge: డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 5G ప్రయోజనాలతో రూ. 500లోపు బెస్ట్ ప్లాన్స్ మీకోసం

అయితే, మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోతే.. ఇంకా మిమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేఆర్ఎంబీ సమావేశాలు కూడా మా ఒత్తిడి వాళ్ళే జరిగాయి.. దీంతో నీళ్లు ఏపీ తీసుకెళ్లొద్దు అని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు.. మేము చేసిన ప్రయత్నం వల్ల నీళ్లు మిగిలాయి.. మేము చెప్పిందే నిజం.. బీఆర్ఎస్ నేతలు చెప్పేది అబద్ధం అన్నారు.