NTV Telugu Site icon

Minister Thummala: రుణమాఫీపై మమ్మల్ని ప్రశ్నించే అధికారం బీఆర్ఎస్ కు లేదు..

Thumalla

Thumalla

Minister Thummala: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడే లక్ష రూపాయల రుణమాఫీని కూడా ఒకే దఫాలో చెయ్యాలని ఆలోచన చెయ్యని వారు.. రెండో సారీ అధికారంలోకి వచ్చాక కూడా రుణ మాఫీకే రైతులను గోస పెట్టి ఎన్నికల వస్తున్నాయి.. ఆఖరి సంవత్సరంలో సగం మందికే చేసి చేతులు దులుపుకున్న బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడటం నిజంగా సిగ్గు చేటు అని పేర్కొన్నారు. ఇక, మీరు రాష్ట్రాన్ని దివాలా తీయించినప్పటికి, ఇచ్చిన మాటకు కట్టుబడి, మొదటి పంట కాలంలోనే రూ. 2 లక్షల లోపు రుణాలను ఒకే దఫాలో 25,35,964 రైతులకు రూ. 20,617 కోట్లు రుణ మాఫీ చేసిన మిమ్మల్ని ప్రశ్నించే అధికారం బీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి తుమ్మల అన్నారు.

Read Also: NTR : జపాన్‌లో భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన ఎన్టీఆర్

ఇక, ఇప్పటి ప్రభుత్వం మీద బురద చల్లి మీ తప్పులను కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలను తెలంగాణ సమాజం ఇప్పటికే తిప్పి కొట్టిన విషయం గ్రహిస్తే మంచిదని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. రైతులకు వాగ్దానం చేసి మోసగించిన బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడే హక్కు లేదు.. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొడుతున్నారు అని పేర్కొన్నారు. మిమ్మల్ని ప్రజలు నమ్మడం లేదన్న విషయాన్ని గ్రహించండి అని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.