Site icon NTV Telugu

Minister Seethakka: బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ.. బీఆర్ఎస్ ముదిరాజ్లకు టికెట్ ఇవ్వలేదు..

Seethakka

Seethakka

Minister Seethakka: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై టీఆర్ఎస్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అపరిచితుడు సినిమాలో మాదిరిగా టీఆర్ఎస్ తన వైఖరి మారుస్తూ వస్తోంది.. ఉదయం రాము.. రాత్రి రేమోగా మారినట్లుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు. ఉదయం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సంపూర్ణ మద్దతూ ప్రకటించిన బీఆర్ఎస్.. సాయంత్రం కాగానే సన్నాయి నొక్కులు నొక్కుతోంది అని విమర్శలు గుప్పించింది. ఈటెల రాజేందర్ పైనా కోపంతో ముదిరాజ్ లకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు.. మా ప్రభుత్వం చేసిన కులగణనకి బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉంది.. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచలేదు అని విమర్శించింది. అధికారం కోల్పోయే ముందు ఎస్టీ రిజర్వేషన్లను పెంచినట్లు డ్రామాలు ఆడారు.. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Read Also: Ashwini Vaishnav: ఇండియాలో రైల్వే ఛార్జీలు పాకిస్తాన్, శ్రీలంక కంటే తక్కువ..

ఇక, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని అవస్తవాలు మాట్లాడుతున్నారు అని మంత్రి సీతక్క అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో కులగణన చేపడుతున్నాం.. అన్ని రకాల న్యాయ నిపుణులు సలహాలు సూచనలు తీసుకొని కూలగణన చేశాం.. బీజేపీ వాళ్ళు ఇది సాధ్యం కాదని అంటున్నారు.. మొన్న ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. బీసీ బిల్లు సాధ్యం కాదు అని ముందే ప్రిపేర్ అవుతున్నారు.. భారతీయ జనతా పార్టీ బీసీ వ్యతిరేకి అని మంత్రి సీతక్క విమర్శలు గుప్పించింది.

Exit mobile version