Site icon NTV Telugu

Ponnam Prabhakar: జగదీష్ రెడ్డి చేసింది తప్పు.. స్పీకర్ను విమర్శించడం బీఆర్ఎస్కి మంచిది కాదు

Ponnam

Ponnam

Ponnam Prabhakar: చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభ మొత్తానికి అధిపతి స్పీకర్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అటువంటి స్పీకర్ ని పట్టుకొని సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.. స్పీకర్ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి పొరపాటు అంటుంటే అవును సభ మీది కాదు అని మాట్లాడుతూ కనీసం నన్ను సంప్రదించలేదు అని చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ గమనిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీశ్వర్ రెడ్డి చేసింది తప్పు.. స్పీకర్ ని సభలో ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పడం లేదు.. దానికి నిన్న ధర్నాలు చేయడం నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే ఈరోజు నిరసనలు తెలుపుతున్నారు అంటూ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

Read Also: IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ!

ఇక, రాష్ట్రంలో నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునివ్వం హాస్యాస్పదం అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కనీసం జ్ఞానం అయినా బీఆర్ఎస్ పార్టీకి రావాలి అని పేర్కొన్నారు. సభలో ఏ విధంగా ఉండాలి సభ వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారు అని అనేది అర్థం అవుతుంది.. ఇది ప్రజలు గమనించాలి.. సభకు కొన్ని సంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి.. ఉదాహరణకు అబద్ధం అనడానికి కూడా విలు లేదు సత్య దూరం.. శాసన సభలో కొన్ని అంశాలు ఉన్నప్పుడు సభ మీ ఒక్కడిదా అంటే ఆయన శాసన సభకు అధిపతి అందులోనే అర్థం ఉంది.. దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించారని మాట్లాడుతున్నారు.. ఇదే బీఆర్ఎస్ గతంలో శాసన మండలి చైర్మన్ మీద కాగితాలు పడేసారని ఇద్దరు సభ్యులను తొలగించి బర్తరఫ్ చేశారు.. ప్రజాస్వామ్యంలో ఇది మర్చిపోయారా?.. ఇటువంటి మాటలు, నిరసనలు వద్దు ఎందుకంటే ఇది బీఆర్ఎస్ కి మంచిది కాదని పొన్నం సూచించారు.

Exit mobile version