Hashish Oil: నగరంలోని చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో హషిష్ ఆయిల్ ను పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా ప్రాంతం నుంచి హైదరాబాద్ కు హషిష్ ఆయిల్ తరలిస్తున్నారని సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF A) టీం తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా ఉన్నటువంటి కారును నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. కారులో గట్టుచప్పుడు కాకుండా ఇద్దరు వ్యక్తులు 1.5 కేజీ ఆయిల్ ను తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఆయిల్ విలువ రూ.5లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కారును సీజ్ చేసి, ఇద్దరిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు.
Read also: Fake Beers: మహబూబ్ నగర్‌లో నకిలీ బీర్లు కలకలం..
పోలీసుల అదుపులో తీసుకున్నవారిలో ఒకరు కర్ణాటకకు చెందిన కొండే మల్లికార్జున్ కాగా.. మరోవ్యక్తి హైదరాబాద్ చెందిన మహమ్మద్ రహమాన్ ఖాన్ గా పోలీసుల గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి హైదరాబాద్ కు చెందిన మహమ్మద్, ఒడిస్సా కు చెందిన రమేష్ గంగాధర్ లపై కూడా కేసు నమోదు చేశారు. వీరు పరారీలో ఉన్నట్లు ఎస్టిఎఫ్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. ఇదే టీం పురాణాపూర్ ప్రాంతంలో 1.1 కేజీల గంజాయిని కూడా పట్టుకున్నారు. ఈ రెండు కేసుల్లో తనిఖీలు నిర్వహించినటువంటి ఎక్సైజ్ సూపర్డెంట్ అంజిరెడ్డి, సీఐ చంద్రశేఖర్ ఎస్సై భరత్ కుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Harish Rao Arrest: పోలీసుల అదుపులో హరీష్‌రావు.. గచ్చిబౌలి పోలీస్టేషన్ కు తరలింపు..