Site icon NTV Telugu

Ponnam Prabhakar: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

Ponnamprabhakar

Ponnamprabhakar

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లపై సర్వే పూర్తైందని తెలిపారు. స్థలాలు లేని వారు, స్థలాలు ఉన్న వారు ఇందిరమ్మ ఇల్లు అడుగుతున్నారని తెలిపారు. సన్న బియ్యం ప్రతి వ్యక్తికి ఆరు కిలోల ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండి: Manchu Manoj: హార్డ్ డిస్క్ వ్యవహారంపై నోరు విప్పిన మంచు మనోజ్..

ఇక రాజీవ్ యువ వికాసం పథకానికి నగరంలో లక్షా 25 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. రూ. 55 కోట్లతో వాటర్ డీసిల్టింగ్ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ తరపున మాన్ సూన్ టీమ్‌లు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. 141 వాటర్ ల్యాగింగ్ పాయింట్లు ఉన్నాయని.. గత పదేళ్లలో తాగునీటి కనెక్షన్లు 8 లక్షలు పెరిగినట్లు తెలిపారు. గోదావరి, కృష్ణా నీటిని తీసుకొస్తున్నామన్నారు. ఎక్కువ వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్న వారు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నోటిసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇక 300 గజాలపై ఉన్న ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిధుల సమస్య వేధిస్తున్నా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి: Miss World 2025: కాసేపట్లో మిస్ వరల్డ్ విజేత ప్రకటన.. ఎలా ఎంపిక చేస్తారంటే.!

Exit mobile version