Meerpet Boy Missing Case: పిల్లలు ఏదైనా వస్తువు కావాలంటే అది ఇచ్చేంత వరకు మారం చేస్తూనే వుంటారు. ఈకాలం పిల్లలు కొన్నివిషయాల్లో అవలంబిస్తున్నా మొండి వైఖరి వారి ప్రాణాలకే కాదు.. కుంటుంబాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. దీంతో తల్లిదండ్రులు గారాబంతో అడిగిందల్లా కాదనకుండా ఇవ్వడంతో పిల్లల పేచీ మరి ఎక్కువగా పెరిగిపోతుంది. దీంతో కావాలన్నిది ఇవ్వలేదని కొందరు పిల్లలు చేసే పనులు కుటుంబాన్ని కంగారు పడేలా చేస్తున్నాయి. ఓ బుడ్డోడు చేసిన పనికి అటు పోలీసులకు ఇటు తల్లిదండ్రులకు కంగారు పడేలా చేసింది. చదువుకోవడం ఇష్టం లేదో లేక తిరుపతికి తీసుకుని వెళ్లిమని అమ్మనాన్నను అడిగినా పట్టించుకోలేదో తెలియదు కానీ.. ఈ బుడ్డోడు చేసిన పని అందిరిని పరుగులు పెట్టించింది. మిస్సయిన బాలుడు తిరుపతిలో ఆచూకీ లభ్యం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఈనెల 4వ తేదీన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: House Collapsed : కాశీ విశ్వనాథ దేవాలయం సమీపంలో కూలిన ఇళ్లు.. ఎనిమిది మంది సమాధి
ఈ నెల 4వ తేదీ సాయంత్రం నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. ఇంటి నుంచి తండ్రి 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు మహీధర్‌రెడ్డిని ట్యూషన్ లో వదిలి వెళ్లాడు. అక్కడ నుంచి బాలుడు మహీధర్‌రెడ్డి బయటకు వచ్చి ట్రైన్ టికెట్ తీసుకుని ఏకంగా తిరుపతికి చెక్కేశాడు. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకున్నాడో ఏమో గానీ తిరుపతికి చేరుకున్నాడు. అయితే ఇక్కడి వరకు బుడ్డోడి కథ వుంటే.. ఇక కొడుకు ఇంటికి రాకుండా తల్లిదండ్రుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇంట్లో అందరూ కంగారు పడి పోలీస్టేషన్ కు చేరుకుని మిస్సింగ్ కేసు పెట్టారు. రంగంలోకి తిగిన మీర్పేట్ పోలీసులు బాలుడి ఆచూకీ కోసం అక్కడ వున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ట్యూషన్ నుంచి మహీధర్‌రెడ్డి ఓ వ్యక్తితో బైక్ పై వెలుతున్నట్లు కనిపించాడు.
Read also: Bangladesh Protest : మరో సారి షేక్ హసీనా ప్రాణాలను కాపాడిన భారతదేశం
మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అని అచూకీ లభ్యం కాలేదు. అనంతరం మలక్ పేట్ రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద ప్రత్యక్షమైంది. అక్కడ టికెట్ తీసుకుంటున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడో పోలీసులు వెతకడం ప్రారంభించారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు 4 బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే బాలుడి ఆచూకీ తిరుపతిలో దొరకడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతిలో బాలుడు వున్నాడని కుటుంబసభ్యులకు తెలియడంతో అందరూ తిరుపతికి బయలు దేరి బాలుడి వద్దకు చేరుకున్నారు. పోలీసులు బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే బాలుడు ఎందుకు తిరుపతికి వెళ్ళాడు? అతనికి డబ్బులు ఎవరు ఇచ్చారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరి కొందరు అయితే ఏంట్రా బుడ్డోడా తిరుపతికి అలా వెళ్లిపోయావ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. అందరిని పరుగులు పెట్టించావ్ కదరా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
We Hub: వీ హబ్ లో భారీ పెట్టుబడులు.. స్టార్టప్ లలో మరో రూ.839 కోట్లు..