Site icon NTV Telugu

KTR Viral Tweet: పైసా పనిలేదు రాష్ట్రానికి లాభం లేదు.. అయినను పోయి రావాలె హస్తినకు..

Ktr

Ktr

KTR Viral Tweet: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రానికి పైసా లేదు, లాభం లేదని.. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి వెళ్లారని.. 25 సార్లు వెళ్లి 25 సార్లు నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్‌ జూబ్లీ కూడా చేస్తివి అని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు.. కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు.

అన్నదాతలు బిచ్చమెత్తుకుంటున్నారని, గురుకులాలు గాలిలో దీపాలుగా మారాయని, వైద్య వ్యవస్థ కుంటుపడిందని, విద్యావ్యవస్థ గాడి తప్పిందని అన్నారు. మూసీ, హైడ్రా పేరుతో పేదళ్ల పొట్టలు కొట్టి, 420 హామీలను మడిచి మూలన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు పండగళ్లా లేవని, ఆడబిడ్డలకు చీరలు రావడం లేదని, తాతయ్యలు ఆశించిన పింఛను, తులం బంగారం జాడే లేదని,స్కూ టీలు, కుట్టు మిషన్లు లేవని, అయినా సీఎం ఢిల్లీకి వెళ్లాల్సిందేనని ట్వీట్టర్ వేదికగా ఫైర్‌ అయ్యారు.


Maoist Leader: మవోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో రూ.కోటి రివార్డు వున్న అగ్రనేత..

Exit mobile version