KTR: తప్పులు జరగలేదంటే రాజకీయ సన్యాసం చేస్తా.. పొంగులేటి కి కేటీఆర్ సవాల్..
- చిత్తశుద్ధి ఉంటే హైకోర్ట్ సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి నాతో రావాలి..
- టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే రాజకీయ సన్యాసం చేస్తా..
- మంత్రి పొంగులేటి కి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్..
KTR: చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్ట్ సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి నాతో రావాలి.. టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే.. రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి పొంగులేటి కి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పదవి ఊడబీకటానికి మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ ఉద్యోగం కోల్పోతున్నాడన్నారు. బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందన్నారు. భార్య సోదరుడు బావమరిది కాకుండా ఏమవుతారు? అని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ కాదు.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన మాకు ఎలక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని ప్రశ్నించారు. కొండగల్ లిఫ్ట్ కథ సహా.. సీఎం కుటుంబ అన్అవినీతిని తేలుస్తామన్నారు. బావమరిది వ్యవహారంలో ఇరికిపోయాడాని సీఎంకు కూడా తెలుసన్నారు.
Read also: సూపర్ రిజల్ట్.. చింతపండు గుజ్జుతో ఫేస్ వాష్
Also Read
చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్ట్ సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి నాతో రావాలని, టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే.. రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. సీజే దగ్గరకు రావటం ఇష్టంలేకుంటే.. ఢిల్లీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరకైనా రావాలని తెలిపారు. సీఎం ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని టెండర్లు రద్దు చేయాలన్నారు. ఫిరాయింపులపై సీఎం, మంత్రులు న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కలసి సింగరేణిని ప్రైవేటీకరిచాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. సింగరేణి వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడాలని తెలిపారు. కిషన్ రెడ్డి ఆధ్వరంలో జరిగిన వేలంపాటకు భట్టి నవ్వుతూ వెళ్ళి మద్దతు తెలిపారని ఆరోపించారు. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటాను ప్రభుత్వం తగ్గించిందన్నారు. లాభాల్లో వాటాను 33శాతం కాకుండా.. 16.9శాతమే పంచుతున్నారన్నారు. లక్షా 90వేలు కాదు.. 3లక్షల 70వేలు బోనస్ గా ఇవ్వాలన్నారు. సింగరేణి కార్మికుల వాటా తగ్గింపుపై గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్పందించాలన్నారు. కూనంనేని సాంబశివరావు తన అభిప్రాయం చెప్పాలన్నారు. వాటా పెంచాలని కార్మికులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలసి ఒత్తిడి చేయాలన్నారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని తెలిపారు.
Hyderabad Rains: రోడ్లను ముంచిన వరద.. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్లు..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో