NTV Telugu Site icon

KTR: బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి.. నంగనాచి మాటలా..?

Ktr

Ktr

KTR: బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయినవారికి పెన్షన్లకు పైసలు లేవా అని ప్రశ్నించారు. అసమర్థుడి పాలనలో.. ఆర్థిక రంగం అల్లకల్లోలం.. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు.. రాష్ట్ర సంపద పెంచడం.. లేనిది ఆదాయం కాదు నీ మెదడలో విషయం.. స్టెచర్ లేకున్నా, పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయి.. పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశావు.. తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నావు.. ఒకటో నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్య పెట్టి ఆశా వర్కర్లు, అంగన్ వాడీలలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నావని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా? అని కేటీఆర్ విమర్శించారు.

Read Also: Sudiksha Missing: సుదీక్ష అదృశ్యంపై పోలీసుల తాజా వెర్షన్ ఇదే..!

ఇక, ప్రజలకు గ్యారెంటీలే కాదు.. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు చేతకానితనానికి నిదర్శనం అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఉద్యోగులు సహకరించడం లేదనడం.. వారిని దారుణంగా అవమానించడమే, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనన్నారు. పరిపాలన రాక పెంట కుప్ప చేసి.. ఉద్యోగులు పని చేస్తలేరని నిందలేస్తే సహించం అన్నారు