NTV Telugu Site icon

KTR Open Challenge: అది నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కేటీఆర్‌ సంచలన ప్రకటన..

Ktr 2

Ktr 2

KTR Open Challenge: వందశాతం రుణమాఫీ అయ్యిందంటున్నారు.. ఏ గ్రామంలో వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపించినా.. చివరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతులకు వందశాతం రుణమాఫీ అయ్యిందేమో అడగండి.. వందశాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్‌ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై స్పందించిన కేటీఆర్.. తలరాత మార్చమని అధికారం ఇచ్చారు.. కానీ, తల్లిని మార్చమని కాదు.. అంటూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సెటైర్లు వేశారు.. అమరజ్యోతి ముందు బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పటికే ఉంది.. బహుజన తల్లి బంగారం వేసుకోకూడదా? అని నిలదీశారు.

Read Also: ICC Banned NCL USA: కొరడా ఝుళిపించిన ఐసీసీ.. చిన్న పొరపాటుకు ఆ లీగ్‌పై నిషేధం

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ విగ్రహం తెలంగాణ తల్లిది కాదు.. కాంగ్రెస్‌ తల్లిది అని విమర్శించారు కేటీఆర్‌.. అధికారంలో ఉన్న పార్టీ మారితే తల్లి మారుతుందా? అని మండిపడ్డారు. వీళ్లు ఏం చేసినా మూడేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది.. మూడేళ్ల తర్వాత రాహుల్‌ తండ్రిని, కాంగ్రెస్‌ తల్లిని గాంధీ భవన్‌కు పంపిస్తాం అని స్పష్టం చేశారు.. ఉద్యమ సమయంలో ఆవిష్కరించిన విగ్రహాల గురించి కోదండరాంను అడగండి.. అందెశ్రీ రాసిన పాటలో కేసీఆర్‌ చరణం కూడా ఉంది అని గుర్తుచేశారు.. బతుకమ్మ తీసేసి చెయ్యి పెట్టారు.. మేం పేదల బతుకులు మార్చే పనిచేశాం.. పేర్లు మార్చే పనిచేయలేదు.. అలా చేసుంటే రాజీవ్‌, ఇందిరా గాంధీ పేర్లతో ఒక్క సంస్థ ఉండేది కాదు అని హెచ్చరించారు..

Show comments