NTV Telugu Site icon

BRS Mlas Protest: సీఎం ఛాంబర్‌ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా.. కేటీఆర్‌, హరీశ్‌రావు అరెస్ట్‌..

Whatsapp Image 2024 08 01 At 2.03.42 Pm

Whatsapp Image 2024 08 01 At 2.03.42 Pm

BRS Mlas Protest: అసెంబ్లీలో సీఎం ఛాంబర్ వద్ద ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీంతో సీఎం ఛాంబర్ బీఆర్ఎస్ నిరసనలతో అట్టుడికింది. సీఎం ఛాంబర్‌ ఎదుట ధర్నాకు దిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీలోని వెల్‌లో బైఠాయించిన వారిని మార్షల్ అసెంబ్లీ వెలుపలికి తీసుకొచ్చారు. అనంతరం వారిని పోలీసులు వాహనంలో సభ నుంచి తీసుకెళ్లారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పద్మారావుగౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌ జాదవ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులను అరెస్టు చేశారు. సీఎం

Read also: Collectors Conference: 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. వీటిపై ఫోకస్‌ పెట్టిన సీఎం చంద్రబాబు..

తెలంగాణ ఆడబిడ్డలను సీఎం క్షమాపణ చెప్పేదాక వదిలి పెట్టేది లేదని కేటీఆర్‌ అన్నారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. మా డిమాండ్ సీఎం వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందే అని అన్నారు. దీంతీ అసెంబ్లీ వద్ద సీఎం ఛాంబర్‌ బీఆర్‌ఎస్‌ నినాదాలు అట్టుడికింది. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని, ఛాంబర్‌ ఎదుట బైఠాయించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండ బీఆర్ఎస ఎమ్మెల్యేలను అదుపులో తీసుకుని పోలీస్టేషన్‌ కు తరలించారు.
Madhura: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదం..నేడు హైకోర్టు తీర్పు