NTV Telugu Site icon

BRS Working President: పబ్లిసిటీ స్టంట్తో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడప లేరు..

Brs

Brs

BRS Working President: మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోంది.. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన STPలను ఉపయోగించుకుంటే సరిపోతుంది.. 4 వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీలు నిర్మించామని ఆయన అన్నారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు.. లక్ష 50 వేల కోట్లు.. 70 వేల కోట్లు.. 50వేల కోట్లు.. అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు.. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది.. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసీ నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇస్తున్నారని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

Read Also: Gold Rate Today: 220, 210, 660.. మూడు రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలు! తులం ఎంతంటే?

ఇక, సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక ఒక ఉదాహరణ.. ప్రభుత్వం ప్రస్తుతం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలు.. పబ్లిసిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇండియాలో 31ఎస్టీపీలు ఉన్న ఏకై‌న నగరం హైదరాబాద్.. STPలు కేసీఆర్ ముందు చూపుకు నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సిటీలో నిర్మించిన అన్ని ఎస్టీపీలను సందర్శిస్రాం.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.