Komatireddy Venkat Reddy: అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్లపై జగడం మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కోమటి రెడ్డి సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నా దానిపై సభలో గందగోళం ఏర్పడింది. దీంతో మంత్రి కోమటి రెడ్డి సభలో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో కాళేశ్వరం నీళ్లు ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజీనామా చేస్తానని మంత్రి అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చర్చకు రావాలని హరీష్ రావు, కేటీఆర్ లకు సవాల్ విసిరిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడగాలని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో ఎకరాకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వల్లే ఏఎంఆర్‌బీ వచ్చిందని గుర్తు చేశారు.
Read also: Chemistry Teacher: విద్యార్థినికి కడుపు చేసిన కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు..
తన బావ, మామ నల్గొండ ప్రజలను చంపేస్తారా? వాళ్ళని చంపేయండి అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీని సరిచేస్తున్నారన్నారు. అందుకు కూడా తన బావ, మామ అడ్డుపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఇవ్వలేదన్నారు. 24గంటల కరెంట్ ఇవ్వలేదని లాగ్ బుక్స్ తెచ్చి చూపిస్తా అన్నారు. ఎక్సైజ్ టెండర్లు ఒక ఏడాది ముందు పెట్టారు.. రూ.2 వేల కోట్లు ముందుగా వసూలు చేశారన్నారు. కేటీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం 14 గంటల కరెంటు మాత్రమే ఇచ్చారన్నారు. నేను సబ్ స్టేషన్ వెళ్లి చెక్ చేశానని తెలిపారు. నేను ఎమ్మెల్యే, ఎంపీగా గత పదేళ్లుగా పని చేశానని సభలో తెలిపారు.
Read also: R.Ashwin Wife: మా ఆయన రిటైర్మెంట్తో రెండ్రోజుల నుంచి నాకు దిక్కుతోచడం లేదు..
కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఇవ్వలేదన్నారు. ఎక్సైజ్ టెండర్లు 2లక్షలు పెట్టీ…రూ.2వేల కోట్లు వసూళ్లు చేశారు… ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో తెలీదన్నారు. తెలంగాణ వచ్చాక నష్టపోయిన జిల్లా నల్గొండ అని తెలిపారు. తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు కేసీఆర్… మాట తప్పారని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలన..వందేళ్లు వెనక్కి తీసుకెళ్ళారని కీలక వ్యాఖ్యలు చేశారు. కూలిపోయే ప్రాజెక్టులు మాత్రమే కట్టారన్నారు. ఇంటింటికి నీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడుగా అన్నావ్ అన్నారు. సిరిసిల్లకు పోదాం ఏ ఇంటికి నీళ్లు వస్తున్నాయో తెలుస్తుందన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు వెళ్దాం అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది ఎవరు? అని ప్రశ్నించారు. బావ,బామ్మర్దికి నల్గొండ జిల్లాపై కోపం ఎందుకు? అని మండిపడ్డారు. మాకు విషం ఇచ్చి చంపండని మంత్రి తెలిపారు.