NTV Telugu Site icon

TG MLC: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణం..

Kodandaram

Kodandaram

TG MLC: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్‌, కోదండరామ్‌ నేడు ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరాం బాధ్యతలు స్వీకరించారు. వీరి ప్రమాణ స్వీకారానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ హాజరయ్యారు.

Read also: Indian National Anthem: 14 వేల గొంతులు ఒక్కసారిగా జాతీయగీతం ఆలాపన.. గూస్‭బంప్స్ పక్కా..

గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యథాతథ స్థితి (స్టేటస్కో) కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. అప్పటి గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు గవర్నర్ చేసిన ప్రకటనను వారు సవాలు చేశారు. దీంతో ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడటంతో నేటి ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్‌, కోదండరామ్‌ ప్రమాణస్వీకారం చేశారు.

Read also: Stag Beetle: దే…వుడా.. ఈ పురుగు ధర అక్షరాల రూ.75 లక్షలు!

కోదండరామ్‌

ఓయూలో సుదీర్ఘకాలం ప్రొఫెసర్‌గా పనిచేసిన కోదండరాం.. దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా పలువురు ప్రముఖ తెలంగాణ వాదులతో కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలను ఏకం చేయడంలో చురుగ్గా పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రస్తుత బీఆర్ ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరుతో 2018 మార్చి 31న తెలంగాణ జన సమితి ఆవిర్భవించింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్ తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. దీనికి తోడు ఉద్యమ నేపథ్యం, ​​ప్రొఫెసర్ గా చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.

Read also: Nagarjuna Sagar: సాగర్‌ కు కొనసాగుతున్న వరద.. 4 గేట్లు తెరచి నీటి విడుదల

అమీర్ అలీ ఖాన్

జర్నలిజంలో విశేష సేవలందించిన అమీర్ అలీ ఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీ ఖాన్ కుమారుడు) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి BCA మరియు సుల్తాన్-ఉల్-ఉలూమ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుండి MBA చేసారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. వివిధ అంతర్జాతీయ ఈవెంట్‌లను కవర్ చేయడానికి విదేశీ పర్యటనలలో ప్రధానమంత్రి మరియు అధ్యక్షులతో కలిసి ఉన్నారు. మైనారిటీలలో విద్య మరియు నైపుణ్యాలను మెరుగుపరచడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్లను స్థాపించి ఉచిత శిక్షణను అందించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సియాసత్ ఇప్పుడు ఖతార్‌కు విస్తరించింది. అక్టోబరు 18, 1973న హైదరాబాద్‌లో జన్మించిన అమీర్ అలీఖాన్‌కు ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో సాగింది.
OTT Movies : థియేటర్లలో రిలీజ్ అయిన వారానికే ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమా..