Kishan Reddy: హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితే తెలంగాణలో రాబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన సినీ నటుడు శివ కృష్ణ కుమారుడు చేరారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి లు రాజకీయాలను దిగజార్చారని కీలక వ్యాఖ్యలు చేశారఒకటిన్నర నెలల పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల పనిలో ఉన్నానని తెలిపారు. ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు. పేదల కోసం చేసింది ఏమీలేదు ఈ ప్రభుత్వం అన్నారు. పేదల పై కన్నేసి వాళ్ళ ఇళ్లను కూల్చి వేయడం అత్యంత దారుణమని తెలిపారు. రేవంత్ రెడ్డి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పేదల ఇళ్లను కూల్చవద్దని చెప్పానని అన్నారు. సీఎం కి విధ్వంసాన్ని, కూల్చివేతలు ఆపాలని లేఖ రాశానని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు… బ్యూటిఫికేషన్ అన్నాడని గుర్తుచేశారు. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వమే బీజం వేసిందన్నారు.
Read also: Doctor Murder: వైద్యుడిని కాల్చిచంపిన ఇద్దరు మైనర్లు!
ప్రజలు ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గిందని తెలిపారు. లాంటి ఆలోచన లేకుండా పేదల ఇళ్లను కూల్చడం నీ బీజేపీ వ్యతిరేకిస్తుంది… అడ్డుకుంటుందని తెలిపారు. 70 శాతం డ్రైనేజ్ మూసిలో కలుస్తుంది… డ్రైనేజ్ ఎక్కడకి పోతుందో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగల, దోపిడీ పార్టీ లు అని తెలిపారు. హైడ్రా అంటే రేవంత్ రెడ్డే అన్నారు. అనేక చెరువుల్లో బడా బాబులు, రాజకీయ వేత్తలు నిర్మాణాలు చేశారు… హైడ్రా ప్రతాపం అక్కడ చెప్పాలన్నారు. ఫాతిమా కాలేజి ఎందుకు కూల్చడం లేదు? అని ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూలుస్తున్నారు…. వారి పిల్లలకు విద్యా సంవత్సరం లేదా? అని మండిపడ్డారు. ఇల్లు కూలుస్తే అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఎక్కడ పోవాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు గతం లో కేసీఆర్ ఇదేవిధంగా చేశాడు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితే తెలంగాణలో రాబోతుందన్నారు. హైదరాబాద్ ఆదాయంతో వెళ్లదీస్తున్నారని తెలిపారు.
Read also: Ram Gopal Varma: మినిస్టర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్జీవీ ట్వీట్..
ఆర్ఆర్, ఆర్జీ టాక్స్ వసూలు చేస్తున్నారని తెలిపారు. పేద వారి ఇళ్ళపైన గడ్డపార వేస్తే… ఈ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. బీజేపీ ఈ ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తుందన్నారు. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి… ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నారు.. ఎక్కడకి పోయారని అన్నారు. కుటుంబాల గురుంచి, మహిళల గురుంచి మాట్లాడడం ఆ రెండు పార్టీలకు అలవాటు అయిందని తెలిపారు. కేసీఆర్ మొదలు పెట్టారు…. రేవంత్ రెడ్డి తీసుకెళ్లారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ తో అనేక కుటుంబాల అంతర్గత విషయాలు విన్నారని కోర్ట్ లో అఫిడవిట్ వేశారని మండిపడ్డారు. ఇలాంటి మాటలు మాట్లాడే వారిని మీడియా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. వారి మాటలు వేసినన్ని రోజులు … వారు మారరని తెలిపారు. రాజకీయాలు ఎంత దిగజారుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
AAArts : ఢిల్లీ ఫైల్స్ పార్ట్ -1 ( బెంగాల్ చాప్టర్) రిలీజ్ డేట్ ఫిక్స్..?