Kishan Reddy: మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు..
- డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు..
- నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకిత భావం ..
- భావితరాలకు స్ఫూర్తి దాయకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. మన్మోహన్ మృతి పట్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేశారు. నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకిత భావం, భావితరాలకు స్ఫూర్తి దాయకం అన్నారు.
Read also: CM Revanth Reddy : మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ మన్మోహన్ ఢిల్లీ ఏయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూజీసీ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వారు దేశానికి వన్నె తీసుకొచ్చారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా.. దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో మన్మోహన్ సింగ్ పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.
2019లో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో వారు అప్పుడప్పుడూ పార్లమెంటు వీల్ చైర్లో రావడం నాకు గుర్తుంది. పార్లమెంటు సభ్యుడిగా వారి అంకితభావానికి ఇది నిదర్శనం అన్నారు. మేధావి, మితభాషిగా, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా.. మన్మోహన్ సింగ్ మన యువతరానికి ఆదర్శమన్నారు. ఆ మహనీయుని ఆత్మకు శాంతి సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Manmohan Singh: శనివారం అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు..
తాజావార్తలు
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!