NTV Telugu Site icon

Kishan Reddy: గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారు..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సీతాఫల్ మండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జామై ఉస్మానియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో BDL వారి సహకారంతో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్, ఫర్నిచర్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అధికశాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం పొందుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నప్పటికీ పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలే దేశానికి పట్టుగొమ్మలు. రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

Read also: Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు..

సమాజం అంతా ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపర్చేలా బాధ్యత తీసుకోవాలన్నారు. వివిధ స్కూళ్లలో విద్యార్థులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలన్నారు. మన గుడి-మన బడి. అందుకే.. పాఠశాలల్లో పరిశుభ్రత పాటించి, ఆరోగ్యంగా ఉండేలా దోహదపడాలని తెలిపారు. దేశంలో స్వచ్ఛభారత్ కారణంగా అనేక మంది ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ల్యాబ్స్, ఫర్నిచర్ తో పాటు పరిశుభ్రత దృష్ట్యా హైప్రెషర్ టాయ్‌లెట్ క్లీనింగ్ మిషన్లను అందజేయడం జరుగుతోందని అన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల ఒత్తిడికి, మానసిక ఇబ్బందులకు గురికావొద్దు. పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించాల్సిన బాధ్యతను పేరెంట్స్ తీసుకోవాలన్నారు.

Read also: Medak Crime: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి..

ప్రైవేటు స్కూళ్లకు మేం వ్యతిరేకం కాదు.. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన ఫలితాలు వచ్చేలా రాజకీయ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రతిఒక్కరు చొరవ తీసుకోవాలని తెలిపారు. నవంబరు 8వ తేదీన జరగనున్న దిశ మీటింగ్ లో హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలపై అధికారులతో చర్చిస్తామన్నారు. సీతాఫల్ మండి హైస్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం, అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో విద్యావ్యవస్థ మెరుగుపర్చుకోవాలని తెలిపారు. 33 సంవత్సరాల తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిచ్చే విధంగా, ప్రోత్సహించేలా మాతృభాషను రక్షించుకునేలా విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. హైస్కూల్స్ లో కూడా వివిధ రకాల ఒకేషనల్ కోర్సులను తీసుకువచ్చేలా నూతన విద్యావిధానాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలన్నారు.
Ramayan : ఇంతకీ రణబీర్, సాయిపల్లవిల రామాయణం ఉన్నట్లా లేనట్లా ?

Show comments