CM Revanth Reddy: తెలంగాణలో యువతకు 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ఎల్‌బీ నగర్ స్టేడియంలో స్వయంగా నేను నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పుణేలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదకొండేళ్ల పాలన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక సక్సెస్ స్టోరీ లేదన్నారు. ఈ పదకొండేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక్క విజయగాథ లేదని తెలిపారు. ప్రతిసారి బాంబు పేలుళ్లు.. ఇతర కొత్త కొత్త అంశాలను ప్రధానమంత్రి మోదీ.. బీజేపీ ఎన్నికల ముందుకు తెరపైకి తెస్తున్నాయి.. చెప్పుకోవడానికి ఏం లేకనే వాటిపై ఆధారపడుతున్నారని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 2002కు ముందే దేశంలోని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మిస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చారని తెలిపారు.
Read also: V.C. Sajjanar: అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే..!! సజ్జనార్ ట్వీట్ వైరల్..
16 నెలల పాటు రైతులు ధర్నాలు, ఆందోళనలు చేశారన్నారు. ఆ సమయంలో 700 మందికిపైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు… ఈ విషయంపై ప్రధానమంత్రి మాట్లాడరు..? అని ప్రశ్నించారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల ఉద్యోగాలపై లోక్‌సభలో ప్రశ్నించా అన్నారు. కేవలం 7.50 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సమాధానం ఇచ్చారు… అంటే పదకొండేళ్ల పాలనలో ఒక్క శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. రైతులు, పేదలు, ఉద్యోగాల విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలంటిన్నిలో విఫలమైన నరేంద్ర మోదీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తాను సవాల్ విసురుతున్నా అన్నారు. కేంద్ర మంత్రి లేదా కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపాలని తెలిపారు. వాళ్లకు వివరాలు ఇస్తాం.. అవసరమైతే వారి విమాన ఖర్చులు మేమే భరిస్తామన్నారు.
Read also: DK Aruna: సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..?
మేము 50 రోజుల్లో రైతుల రుణ ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేసి రుణ మాఫీ చేశాం… ప్రతి రైతు ఖాతా వివరాలు అందిస్తామన్నారు. తెలంగాణలో యువతకు 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఎల్‌బీ నగర్ స్టేడియంలో స్వయంగా నేను నియామక పత్రాలు అందించా అన్నారు. తెలంగాణలో మహిళలు ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయణించే అవకాశం కల్పించాలన్నారు. ఇప్పటికే కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. 2004లో సోనియా గాంధీ సూచన మేరకు దీపం పథకం కింద రూ.400 కే గ్యాస్ సిలిండర్..స్టవ్ కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రూ.400 గ్యాస్ సిలిండర్‌ను రూ.1200కు పెంచారన్నారు. సిలిండర్ ధర పెంపు ద్వారా పేద మహిళలు రూపాయి రూపాయి వంటింట్లో దాచుకున్న డబ్బును మోడీ చోరీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పేద మహిళలకు రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం… 50 లక్షల కుటుంబాలు రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం.. కావాలంటే ఆ వివరాలు అందిస్తామన్నారు.
Read also: Eatala Rajendar: 144 సెక్షన్ పెట్టి అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారు..
రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నాం.. పట్టణాలు, పల్లెల్లో పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ రానంత ధాన్యం దిగుబడి తెలంగాణలో ఈ సారి వచ్చిందన్నారు. మొత్తం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది.. ఎమ్మెస్పీకి అదనంగా రైతులకు ప్రతి క్వింటాకు మా ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తోందన్నారు. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు గానూ సోనియా గాంధీ నేతృత్వంలో దేశంలోనే మొదటి సారిగా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఇప్పుడు దానిని తెలంగాణలో మేం రూ.10 లక్షలకు పెంచాం…పేదల వైద్యానికి ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. మా గ్యారంటీలు కచ్చితమైన గ్యారంటీలు.. మోదీ గ్యారంటీలు కాదు.. భారతీయ జుటా పార్టీ గ్యారంటీలు కాదన్నారు. తెలంగాణ ఇస్తానని సోనియా హామీ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ దెబ్బతింటదని తెలిసినా ఇచ్చారన్నారు. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగుస్తున్నందున మోడీ.. బీజేపీ నాయకులు రేపు హైదరాబాద్ వస్తే సచివాలయంలో కూర్చోబెట్టి నేను చెప్పిన ప్రతి అంశం వివరాలు అందజేస్తా…అందులో ఏమైనా తప్పు ఉంటే క్షమాపణలు చెబుతా అన్నారు.
Read also: Kishan Reddy: ఆ ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారు.. కిషన్ రెడ్డి ఫైర్..
మోడీకి… పదకొండేళ్ల కాలంలో దేశంలోనూ, మహారాష్ట్రలోనూ విజయగాథలు (సక్సెస్ స్టోరీలు) ఏం లేవన్నారు. ముంబయి దేశానికి ఆర్థిక రాజధాని… మహారాష్ట్రలో రాజకీయంగా దేశంలో రెండో పెద్ద రాష్ట్రం..అటువంటి రాష్ట్రాన్ని మోదీ కోవర్ట్ ఆపరేషన్లు.. విద్రోహుల అడ్డాగా మార్చారన్నారు. చిన్న కార్యకర్త శిందేను బాలాసాహెబ్ మంత్రి వరకు తీసుకువస్తే ఆయనను ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా మోదీకి గులాంగా మారారని తెలిపారు. శరద్ పవార్ సొంత బిడ్డను కాదని సోదరుని కుమారుడు అజిత్ పవార్‌ను మంత్రి పదవులు ఇస్తే ఆయనను మోడీకి గులాంగా మారారని మండిపడ్డారు. అశోక్ చవాన్‌ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తే ఆయన మోదీకి గులాంగా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయిలోని ధారావిని కబ్జా చేసేందుకు విద్రోహులైన శిందే, అజిత్ పవార్, అశోక్ చవాన్‌ను వినియోగించుకుంటున్నారని తెలిపారు. రూ.12 కోట్ల మహారాష్ట్ర ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ఇది ఎన్నిక కాదు.. ఇదో యుద్ధం.. గుజరాత్‌కు చెందిన ఇద్దరు మహారాష్ట్రను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీకి (ఎంవీఏ) ఓటు వేయాలన్నారు.
Read also: Pushpa -2 : పుష్ప -2 ట్రైలర్ పై టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఏమన్నారంటే..?
మహారాష్ట్రలో ఎంవీఏను గెలిపిస్తే తెలంగాణలో అమలవుతున్న అన్ని హామీలు మహారాష్ట్రలో అమలవుతాయన్నారు. విలేకరుల ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి జవాబులు అన్నారు. మైనారిటీ రిజర్వేషన్లు చట్టపరంగా చేయాల్సినవి… తెలంగాణలో మేం 4 శాతం అమలు చేస్తున్నాం.. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మోడీకి కేంద్రంలో పదకొండేళ్లలో విజయ గాధ లేదు.. గుజరాత్‌లోనూ లేదు.. చరిత్రలో మహారాష్ట్ర గురించి శివాజీ.. అంబేడ్కర్ తదితరుల గొప్పతానాన్ని చదువుకున్నారని తెలిపారు.ఇప్పుడు మీరు షిండే.. అజిత్ పవార్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో విభేదాలంటూ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ తప్పుడు ప్రచారం చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ జూనియర్లు.. సీనియర్లు అని ప్రచారం చేశారన్నారు.
Read also: Kannappa : కన్నప్ప అప్ డేట్.. మహాదేవ శాస్త్రి వచ్చేది అప్పుడే
కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లోనూ అలానే ప్రచారం చేశారని తెలిపారు. చివరకు ఏమైంది..? సంక్షోభ సమయంలోనే పార్టీలోనైనా.. దేశంలోనైనా జెండా పట్టుకునేందుకు నూతన నాయకత్వం బయటకు వస్తుందన్నారు. సంక్షోభం లేకుండా మీకు కొత్త నేత రారని తెలిపారు. మోడీ.. అంబానీ, అదానీ కోసం పని చేస్తారన్నారు. ఇప్పుడు అంబానీ కూడా లేరు.. అదానీ ఒక్కరి కోసమే పని చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీకి మహారాష్ట్రను పూర్తిగా దోచిపెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 95 శాతానికిపైగా ప్రజలు హిందువులు.. వారు బీజేపీకి ఓటు వేయలేదు.. కాంగ్రెస్‌కు వేశారు. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ను ఆదరిస్తారన్నారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక కార్పొరేట్ కంపెనీల అప్పులు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారన్నారు. అదే మేం రైతులకు రుణమాఫీ చేస్తే బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. పేద మహిళలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పేద మహిళలకు అందించే సంక్షేమం, సహాయం తిరిగి మార్కెట్‌లోకి వస్తుందని, అది ఖర్చు కాదు పెట్టుబడి అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Viral News: వీడియో గేమ్‌లో ఓడిపోవడంతో.. తన 8 నెలల కొడుకును గోడకు విసిరేసిన తండ్రి