Kannappa : కన్నప్ప అప్ డేట్.. మహాదేవ శాస్త్రి వచ్చేది అప్పుడే
- కన్నప్ప మూవీ లేటెస్ట్ అప్ డేట్ రిలీజ్
- మహాదేవ శాస్త్రిగా కనిపించనున్న మోహన్ బాబు
- నవంబర్ 22న విడుదల కానున్న ఫుల్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.
Read Also:iQOO Neo 10 Series: ‘ఐకూ నియో 10’ సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్, ప్రైస్ డీటెయిల్స్ ఇవే!
Also Read
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
ఇక కథ, నటీనటుల ఎంపిక మొదలుకొని ప్రతి అంశం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. సినిమాలో కన్నప్పగా మంచు విష్ణు ప్రధాన పాత్రలో కనిపించనుండగా, ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ శివుడి క్యారెక్టర్ చేయనున్నారు. ఇక మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల వంటి తారాగణం ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీరితో పాటు దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రాంకా వంటి ప్రముఖులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ విభిన్న తారాగణం సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. ఇప్పటికే కన్నప్ప నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా, మంచు విష్ణు మరో పవర్ఫుల్ అప్‌డేట్ ఇచ్చేశారు. ఇందులో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో పాటు మోహన్ బాబు లుక్‌ను విడుదల చేశారు. దీంతో కన్నప్ప పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ లుక్‌లో మూడు నామాలు, కుంకుమ బొట్టు ఉన్న హాఫ్ లుక్ తో ఆయన పాత్ర ప్రత్యేకతను చాటుతోంది.
Read Also:Mokshagna : గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య.. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా షూటింగే లేటు
కానీ పూర్తి ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఇది నవంబర్ 22న విడుదల కానున్న ఫుల్ పోస్టర్‌పై ఆసక్తిని పెంచింది. మహాదేవ శాస్త్రి పాత్ర సినిమా కథకు కీలకమని, అది ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని చిత్రయూనిట్ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కన్నప్ప సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా పూరాణాల్లో ప్రసిద్ధి చెందిన కన్నప్ప భక్తుడి జీవితాన్ని ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు షేర్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నప్ప సినిమాలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో ప్రేక్షకులను మెప్పించనుండటం ఖాయం అని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్‌డేట్..
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!