Site icon NTV Telugu

Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ మనుగడ సాధ్యం..

Kavitha

Kavitha

Kavitha: మీడియాతో చిట్ చాట్ లో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ ను కసబ్ తో పోల్చడం తప్పు.. రేవంత్ ను రెండుసార్లు ఉరి వేయాల్సి ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.. కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కూతురుగా నాకు రక్తం ఉడుకుతుంది.. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్, బబుల్ షూటర్ ఏం చెబుతారని విమర్శించింది. సిట్ ముందు నేను హాజరై అన్ని వివరాలు చెబుతా.. బీఆర్ఎస్ మనుగడ సాధ్యం కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి ప్రాజెక్టులపై వివరణ ఇవ్వాలి.. లేదంటే బీఆర్ఎస్ ను ఎవరు కాపడలేరని కవిత పేర్కొనింది.

Read Also: CM Revanth Reddy: ఈ మనుషుల విషం.. మూసీలో మురికి కంటే ఎక్కువ..

ఇక, బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం జాగృతినే అని కవిత తెలిపింది. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం చెబుతారు.. పిల్ల కాకులతో అసెంబ్లీ ఏం జరగదు.. రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. ఇంకా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వలేదు. ఇంకా ఎప్పడు ఇస్తారు? అని ప్రశ్నించింది. మోసం చేసిన వ్యక్తికే మళ్ళీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే ఎలా? అని అడిగింది. ఆంధ్ర నాయకులకు ఉన్న ఐక్యత తెలంగాణ నాయకులకు లేదన్నారు. నీళ్ల గురించి కేసీఆర్ కంటే రేవంత్ కు ఎక్కువ తెలుసా? హరీష్ కు ఎక్కువ తెలుసా?.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు.. పెన్షన్లు రావడం లేదు, కరెంటు రావడం లేదు, మిషన్ భగీరథ పడకేసిందని కవిత మండిపడింది.

Read Also: పోర్టబుల్ ప్రొజెక్టర్‌లో కొత్త చాప్టర్.. AI ఫీచర్లతో Samsung The Freestyle+ గ్లోబల్ లాంచ్..!

అయితే, అసలు నిజాన్ని ప్రజలకు చెప్పాల్సిన కేసీఆర్ సభకు రాకుండా టీఆర్ఎస్ ను సర్వ నాశనం చేసిన హరీష్ రావుకు పాలమూరు మీద మాట్లాడే అవకాశం సభలో ఇవ్వడం ఏందీ అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించింది. అప్పుడు జగన్ మెహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబులు తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం చేశారు.. అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అదే తరహా విధానాన్ని అమలు చేస్తుందన్నారు. నేను కేసీఆర్ తో మాట్లాడక ఆరు నెలలు అవుతుంది అని చెప్పుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో బలమైన రాజకీయ శక్తిగా మారుతాం. ఎన్నికల్లో పోటీ చేస్తాం.. నాకు కొత్త పార్టీపై క్లారిటీ ఉంది.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఔట్ రైట్ గా పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. మా యాత్రలో కూడా పబ్లిక్ పార్టీ పెట్టే దాని గురించే అడుగుతున్నారు.. పప్పన్నం తింటాం.. పాదయాత్ర చేస్తాం ఇదే నా ఫిలాసఫీ.. నన్ను అవమానకరంగా పార్టీలోంచి సస్పెండ్ చేశారు.. నేను ఆ పార్టీలోకి వెళ్ళను.. మొదటి నుంచి స్వతంత్రంగా పని చేసింది నేను ఒక్కదాన్నే.. 2006 నుంచి 2014 వరకు జాగృతి పేరుతో పని చేశా.. మిగతా నాయకులు కేసీఆర్ చెప్పినట్లు పని చేశారని కవిత వెల్లడించింది.

Exit mobile version