Site icon NTV Telugu

Jubilee Hills By-Election: ప్రారంభమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్‌..

Bypoll

Bypoll

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక, అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6.45 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించారు. కాగా, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది ఉండగా.. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అయితే, మొత్తం 4,01,365 ఓటర్లు కాగా.. అందులో పురుషులు 2,08,561, ఉండగా మహిళలు 1,92,779, 25 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 139 సెంటర్లలో 407 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. 2,400 మంది పోలీసులతో భద్రత కొనసాగుతుంది. ఎన్నికల నిర్వహణకు 2,060 మంది ఎన్నికల సిబ్బంది ఉండగా.. ఒక బూత్ లో ఒక కంట్రోల్ యూనిట్, నాలుగు బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటు చేశారు. మొత్తం 2,394 బ్యాలెట్ యూనిట్లు, 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్లు సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ను సిద్ధం చేశారు.

Read Also: Jubilee Hills By Election Live Updates: జూబ్లీహిల్స్ బైపోల్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

ఇక, ఉప ఎన్నిక కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2,400 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతుంది. పార మిలిటరీ కేంద్ర బలగాలతో పహరా కాస్తున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజక వర్గ పరిధిలోని రహమత్ నగర్, బోరబండ, యూసఫ్ గూడా, శ్రీరామ్ నగర్ లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లు వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఎన్నికల అధికారులు మానిటరింగ్‌ చేయనున్నారు.

Exit mobile version