Jubilee Hills By-Election: ప్రారంభమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్..
- ప్రారంభమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్..
- ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్..
- ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది..
- 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు..
- పోలింగ్‌కు 2,400 మంది పోలీసులతో భద్రతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక, అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6.45 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించారు. కాగా, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది ఉండగా.. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అయితే, మొత్తం 4,01,365 ఓటర్లు కాగా.. అందులో పురుషులు 2,08,561, ఉండగా మహిళలు 1,92,779, 25 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 139 సెంటర్లలో 407 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. 2,400 మంది పోలీసులతో భద్రత కొనసాగుతుంది. ఎన్నికల నిర్వహణకు 2,060 మంది ఎన్నికల సిబ్బంది ఉండగా.. ఒక బూత్ లో ఒక కంట్రోల్ యూనిట్, నాలుగు బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటు చేశారు. మొత్తం 2,394 బ్యాలెట్ యూనిట్లు, 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్లు సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ను సిద్ధం చేశారు.
Read Also: Jubilee Hills By Election Live Updates: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్డేట్స్..
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
- Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
ఇక, ఉప ఎన్నిక కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2,400 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతుంది. పార మిలిటరీ కేంద్ర బలగాలతో పహరా కాస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ పరిధిలోని రహమత్ నగర్, బోరబండ, యూసఫ్ గూడా, శ్రీరామ్ నగర్ లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లు వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఎన్నికల అధికారులు మానిటరింగ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!