Site icon NTV Telugu

Jubilee Hills By Election Live Updates: జూబ్లీహిల్స్ బైపోల్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

Jubilee Hills By Election L

Jubilee Hills By Election L

Jubilee Hills By Election Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బై ఎలక్షన్‌ పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.. అంటే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ బూత్‌లో క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కలిపిస్తారు.. ఇక, ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది ఉన్నారు…. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. 1,761 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.. 800 మంది కేంద్ర బలగాలు బందోబస్తులో ఉన్నారు.. 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లు వినియోగిస్తున్నారు.. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు & డ్రోన్ల ద్వారా మానిటరింగ్‌ చేస్తున్నారు ఎన్నికల అధికారులు.. మరోవైపు ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు…

The liveblog has ended.
  • 11 Nov 2025 08:21 PM (IST)

    Exitpoll Survey: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం

    జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం. చాణక్య స్ట్రాటజీస్‌: కాంగ్రెస్‌ 46 శాతం, బీఆర్ఎస్‌ 41 శాతం, బీజేపీ 6 శాతం. స్మార్ట్‌పోల్ : కాంగ్రెస్‌ 48.2 శాతం, బీఆర్‌ఎస్‌ 42.1 శాతం, బీజేపీ 8 శాతం.

  • 11 Nov 2025 06:20 PM (IST)

    ముగిసిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌

    HYD: ముగిసిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌. సాయంత్రం 5గంటల వరకు 47.16 శాతం పోలింగ్‌ నమోదు. సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికే ఓటు వేసేందుకు అనుమతి. ఈనెల 14న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితం.

  • 11 Nov 2025 05:39 PM (IST)

    సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం ఓటింగ్‌

    మరికాసేపట్లో ముగియనున్న పోలింగ్‌. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగింపు. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం ఓటింగ్‌ నమోదు.

  • 11 Nov 2025 05:10 PM (IST)

    కనీసం 50 శాతానికి కూడా చేరుకోవడం కూడా కష్టమే..!

    మరో గంటలో ముగియనున్న జూబ్లీహిల్స్ ఎన్నిక పోలింగ్ పోరు. హోరా హోరిగా పోలింగ్ జరుతుందని అనుకున్న ఎన్నికల అధికారులు. ఆశించిన మేర ఫలించని పోలింగ్ పర్సెంటెజీ. కనీసం 50 శాతానికి కూడా చేరుకోవడం కూడా కష్టమే అన్నట్లు కనిపిస్తున్న పరిస్థితి..

  • 11 Nov 2025 04:01 PM (IST)

    పోలింగ్ కి మిగిలింది మరో రెండు గంటలు మాత్రమే

    పోలింగ్ కి మిగిలింది మరో రెండు గంటలు మాత్రమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇంకా ఊపొందుకొని పోలింగ్ ప్రక్రియ.. పోలింగ్ మొదలై సుమారు 9 గంటలు గడుస్తున్నా పెరగని పోలింగ్ శాతం.. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం మాత్రమే నమోదైన పోలింగ్.. ఎన్నికల సంఘం ఆశించిన మేర పెరగని పోలింగ్ శాతం.. చివరి రెండు గంటల్లో పోలింగ్ పెరిగే అవకాశం.. 6 గంటల లోపు పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటున్న ఎన్నికల అధికారులు..

  • 11 Nov 2025 03:31 PM (IST)

    ఉప ఎన్నిక పోలింగ్ 40.20%

    మధ్యాహ్నం 3 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 40.20% నమోదు

  • 11 Nov 2025 03:01 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు గోపీచంద్

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో శ్రీనగర్ కాలనీలోని మహిళ సమాజం పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు గోపీచంద్.

  • 11 Nov 2025 01:46 PM (IST)

    మధ్యాహ్నం 1 గంటకు ఎంత శాతమంటే..?

    నెమ్మదిగా కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. మధ్యాహ్నం 1 గంట వరకు జూబ్లీహిల్స్ లో 31.94 శాతం పోలింగ్ నమోదు

  • 11 Nov 2025 12:53 PM (IST)

    దొంగ ఓట్లు లేవు..

    షేక్ పేట ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బూతుల్లో 20 శాతం పోలింగ్ అయ్యింది.. పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం.. కేంద్ర బలగాలతో కూడా భద్రత ఏర్పాటు చేశాం.. 5 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి భద్రతను పెంచాం.. ఓటర్లు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేస్తున్నాం.. హోటల్ రూమ్స్, లాడ్జ్ ల్లో తనిఖీ చేశాం.. దొంగ ఓట్లు అనేది ఎక్కడా లేదు.. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం: సౌత్ ఈస్ట్ డీసీపీ చంద్రమోహన్

  • 11 Nov 2025 11:58 AM (IST)

    ఓటర్లు లేక ఖాళీగా కనిపిస్తున్న పలు పోలింగ్ కేంద్రాలు..

    వెంగళ్రావు నగర్, మధురా నగర్లో ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కానీ ఓటింగ్..ఓటింగ్ ప్రక్రియ మొదలై ఐదు గంటలు అవుతున్నా.. ఇళ్లలోంచి బయటకు రాని ఓటర్లు.. మందకొడిగా కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ.. ఓటర్లు లేక ఖాళీగా కనిపిస్తున్న పలు పోలింగ్ కేంద్రాలు..

  • 11 Nov 2025 11:36 AM (IST)

    11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్..

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదు

  • 11 Nov 2025 11:20 AM (IST)

    నాన్ లోకల్స్ పై కేసులు పెట్టండి: సీఈఓ

    జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈఓ సీరియస్.. నియోజకవర్గంలో ఉన్న నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు

  • 11 Nov 2025 10:46 AM (IST)

    షేక్పేట్లో రాజకీయ పార్టీలు హల్చల్

    షేక్పేట్ డివిజన్లోని 16, 17 నెంబర్ పోలింగ్ బూత్ వద్ద రాజకీయ పార్టీలు హల్చల్.. పోలింగ్ బూత్ బయట బహిరంగంగా ఫలానా గుర్తుకి ఓటు వేయాలంటూ హడావుడి.. పోలింగ్ బూత్ బయట ప్రచారం చేసేవారిని అరెస్ట్ చేసిన పోలీసులు..

  • 11 Nov 2025 10:42 AM (IST)

    ప్రతి ఒక్కరు ఓటు వేయాలి: దీపక్ రెడ్డి

    వెంగళ్రావు నగర్లో పోలింగ్ బూత్లను పరిశీలించిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి.. బీజేపీ నేతలపై దాడులకి పాల్పడుతున్నారు.. బూతుల్లో తిరుగుతున్న బీజేపీ వాళ్ళను సాయంత్రం చేసుకుంటామని బెదిరిస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదు.. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. చాలా మంది తరువాత వేద్దామని మాట్లాడుకుంటున్నారు.. మళ్ళీ మళ్ళీ ఓటర్లను ఓటింగ్లో పాల్గొనాలని కోరుతున్నాను: లంకల దీపక్ రెడ్డి

  • 11 Nov 2025 10:28 AM (IST)

    ఓటు వేసిన తనికెళ్ల భరణి..

    యూసుఫ్‌గూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న నటుడు తనికెళ్ల భరణి..

  • 11 Nov 2025 10:15 AM (IST)

    ఓటేసిన ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు..

    ఓటు వేసిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు.. ఓటేసిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు.. డ్రోన్లతో పోలింగ్ బూతుల దగ్గర పరిస్థితి పర్యవేక్షిస్తున్న అధికారులు..

  • 11 Nov 2025 10:05 AM (IST)

    క్యూ కట్టిన ఓటర్లు..

    ఎర్రగడ్డ డివిజన్ లో కొనసాగుతున్న పోలింగ్.. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ఏరియాల్లోని పోలింగ్ బూతుల్లో ఓటర్ల క్యూ..

  • 11 Nov 2025 10:03 AM (IST)

    షేక్ పేట్ లో మందకోడిగా పోలింగ్..

    షేక్ పేట్ డివిజన్ మందకోడిగా పోలింగ్.. 10 గంటలు కావస్తున్న కనీసం 10 శాతం దాటనీ పోలింగ్.. పోలింగ్ బూత్ బయట భారీగా గుమిగూడుతున్న ఏజెంట్లు.. పోలీసులు, డ్రోన్ పర్యవేక్షణలో బందోబస్తు.. షేక్ పేట్ డివిజన్ లో 70 పోలింగ్ స్టేషన్లు.. దాదాపు 70 వేల మంది ఓటర్లు...

  • 11 Nov 2025 10:01 AM (IST)

    ఓటేసిన హైడ్రా కమిషనర్..

    కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న హైడ్రా కమీషనర్ AV. రంగనాథ్..

  • 11 Nov 2025 09:45 AM (IST)

    ప్రశాంతంగా పోలింగ్..

    జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా జరుగుతున్న ఓటింగ్.. ఉదయం 9 గంటల వరకు 9.2 శాతం పోలింగ్ నమోదు.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.. మొదట అక్కడక్కడా మొరాయించిన ఈవీఎం మిషన్లు.. వెంటనే స్పందించి ఇష్యూ ను క్లియర్ చేసిన టెక్నికల్ టీం..

  • 11 Nov 2025 09:29 AM (IST)

    డ్రోన్ సహాయంతో పరిశీలన..

    రహమత్ నగర్, బోరబండ, శ్రీరామ్ నగర్, యూసుఫ్ గూడా సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాల్లో డ్రోన్ సహాయంతో పరిస్థితినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పోలీసులు.. రహమత్ నగర్ లోని 74 పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద డ్రోన్ సహాయంతో పరిశీలన..

  • 11 Nov 2025 09:23 AM (IST)

    ఓటేసిన మాజీ డీజీపీ..

    యూసఫ్ గూడ డివిజన్ లోని నాసర్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ డీజీపీ జితేందర్ దంపతులు..

  • 11 Nov 2025 09:17 AM (IST)

    మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ..

    మందకొడిగా కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ.. పోలింగ్ ప్రారంభమై 2 గంటలు పూర్తి.. గడిచిన రెండు గంటల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 100 కు మించని ఓటింగ్.. సాయంత్రం వరకు సమయం ఉండడంతో నిదానంగా ఓటింగ్ లో పాల్గొనే అవకాశం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటి రెండు గంటల్లో 9.2 శాతం పోలింగ్ నమోదు

  • 11 Nov 2025 08:52 AM (IST)

    డ్రోన్ సహాయంతో పరిశీలన..

    రహమత్ నగర్, బోరబండ, శ్రీరామ్ నగర్, యూసుఫ్ గూడా సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాల్లో డ్రోన్ సహాయంతో పరిస్థితినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పోలీసులు..

  • 11 Nov 2025 08:39 AM (IST)

    ఓటింగ్ సరళి బాగుంది..

    ఓటింగ్ సరళి బాగుంది.. నేను శ్రీనగర్ కాలనీలో ఓటు వేసేందుకు వెళ్తున్నాను.. ఇప్పుడిప్పుడే ఓటర్లు బయటికి వస్తున్నారు.. షేక్ పెట్ డివిజన్ లో మైనారిటీ ఓటర్లు ఎక్కువ ఉన్న బూత్ లను పరిశీలిస్తున్నాను: బీజేపీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి దీపక్ రెడ్డి

  • 11 Nov 2025 08:12 AM (IST)

    ఓటేసిన ఎస్ఎస్ రాజమౌళి..

    షేక్పేట్లోని ఇంటర్నేషనల్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. పోలింగ్ బూత్ నెంబర్ 28లో ఓటేసిన రమా రాజమౌళి..

  • 11 Nov 2025 08:05 AM (IST)

    ఐడీ కార్డులు వేసుకోని ఏజెంట్లు..

    ఎర్రగడ్డలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారి కర్ణన్.. ఏజెంట్లు ఐడీ కార్డులు వేసుకోలేకపోవడంతో అభ్యంతరం చెప్పిన కర్ణన్.. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి: ఎన్నికల అధికారి కర్ణన్

  • 11 Nov 2025 08:02 AM (IST)

    షేక్పేట్లో పోలింగ్ స్టార్ట్..

    షేక్పేట్లో కూడా పోలింగ్ ప్రారంభమైంది.. 6 పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తాయి.. సెట్ చేశాం.. గతంలో కంటే 40 పోలింగ్ కేంద్రాలు పెంచాం: ఎన్నికల అధికారి కర్ణన్

  • 11 Nov 2025 07:58 AM (IST)

    షేక్పేట్లోని పోలింగ్ సెంటర్ వద్ద గొడవ..

    షేక్పేట్లో ఒక పోలింగ్ బూత్ బయట రభస.. కాంగ్రెస్ పార్టీ షేక్పేట్ డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ పోలీసులతో వాగ్వాదం.. బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్లోకి పంపించి తమని పంపించడం లేదని సీరియస్.. తను డివిజన్ అధ్యక్షుడి అని తెలియక పంపలేదని పోలీసుల క్లారిటీ ఇవ్వడంతో సద్దుమణిగిన గొడవ..

  • 11 Nov 2025 07:51 AM (IST)

    ఈవీఎంలలో సాంకేతిక లోపం.. ఓటర్ల ఇబ్బంది..

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. బోరబండలో మొరాయించిన ఈవీఎం.. పోలింగ్ బూత్ నెంబర్ 34లో ఈవీఎంలో సాంకేతిక సమస్య.. రహమత్నగర్లోని 165, 166 బూత్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. నిలిచిపోయిన పోలింగ్, క్యూలైన్లో వేచి ఉన్న ఓటర్లు.. పోలింగ్ బూత్లో ఇబ్బంది పడుతున్న సిబ్బంది, ఓటర్లు..

  • 11 Nov 2025 07:44 AM (IST)

    మొరాయిస్తున్న ఈవీఎంలు..

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్.. కొన్ని డివిజన్‌లలో సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్న ఈవీఎంలు.. పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో పవర్ కట్ సమస్యలు.. దాదాపు 11 పోలింగ్ బూత్ లలో మొరాయించిన ఈవీఎంలు..

  • 11 Nov 2025 07:42 AM (IST)

    ఓటుహక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి

  • 11 Nov 2025 07:40 AM (IST)

    వెంగళరావునగర్ లోనూ మొరాయించిన ఈవీఎంలు..

    వెంగళరావునగర్ డివిజన్లోనూ మొరాయించిన ఈవీఎంలు.. 76, 78 బూత్లో ప్రారంభం కానీ పోలింగ్.. మొరాయిస్తున్న ఈవీఎంలను పరిశీలిస్తున్న అధికారులు.. పోలింగ్ కేంద్రం దగ్గర భారీగా క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లు..

  • 11 Nov 2025 07:27 AM (IST)

    ఈవీఎంలలో సమస్య.. వేచి ఉన్న ఓటర్లు..

    షేక్పేట్ డివిజన్ పోలింగ్ బూత్ నెంబర్ 30లో టెక్నికల్ సమస్య వల్ల ఇంకా ప్రారంభం కానీ పోలింగ్.. చెక్ చేస్తున్న పోలింగ్ అధికారులు.. 25 నిమిషాలుగా క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లు..

  • 11 Nov 2025 07:20 AM (IST)

    ఓటేసిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీత..

    ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. నవోదయ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ నగర్ వెల్ఫేర్ కేంద్రంలో ఓటేసి మాగంటి సునీత..

  • 11 Nov 2025 07:17 AM (IST)

    ఒకే దగ్గర 10 వేల మంది ఓటింగ్..

    యూసఫ్ గూడ ప్రభుత్వ స్కూల్లోనే 10 పోలింగ్ సెంటర్లు.. ఒకే దగ్గరకు రానున్న 10 వేల మంది ఓటర్లు..

  • 11 Nov 2025 07:14 AM (IST)

    షేక్పేట్లో ప్రారంభం కానీ పోలింగ్..

    షేక్పేట్ డివిజన్ పోలింగ్ బూత్ నెంబర్ 30లో టెక్నికల్ సమస్య వల్ల ఇంకా ప్రారంభం కానీ పోలింగ్.. చెక్ చేస్తున్న పోలింగ్ అధికారులు

  • 11 Nov 2025 07:11 AM (IST)

    ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్..

    ప్రారంభమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్.. ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది.. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. పోలింగ్కు 2,400 మంది పోలీసులతో భద్రతా..

Exit mobile version